Political News

బెయిలొచ్చినా.. కొమ్మినేనికి మోక్షం దక్కలేదే

దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదన్న సామెతలా మారింది సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా..శుక్రవారమే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తక్షణమే కొమ్మినేనిని జైలు నుంచి విడుదల చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ లభించి ఆదివారం నాటికి మూడు రోజులు అవుతున్నా..కొమ్మినేని ఇంకా జైలులోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఇటీవల సాక్షి టీవీలో కొమ్మినేని నేతృత్వంలో జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్చను నిర్వహిస్తున్న యాంకర్ గా కొమ్మినేని కృష్ణంరాజును వారించకుండా ముసిముసిగా నవ్విన కొమ్మినేని చిక్కుల్లో పడ్డారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన కూటమి సర్కారు… కృష్ణంరాజును ఏ1గా, కొమ్మినేనిని ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత కొమ్మినేనిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత కృస్ణంరాజునూ అరెస్టు చేశారు. ఇప్పుడు వారిద్దరూ గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు.

కొమ్మినేనికి బెయిల్ వచ్చినా… సుప్రీంకోర్టు నుంచి సదరు ఉత్తర్వులు ఆ రోజే ట్రయల్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే శుక్రవారం సాయంత్రం దాకా ఆ ఉత్తర్వులు ట్రయల్ కోర్టుకు రాలేదు. ఇక శనివారం రెండో శనివారం కావడంతో సెలవు దినంగా పరిగణిస్తూ కోర్టులు పని చేయలేదు. ఆదివారం అన్నింటికీ సెలవే. ఇక సోమవారం అయినా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వచ్చినా.. ట్రయల్ కోర్టు నుంచి సవివర నిబంధనలు రూపొంది.. బెయిల్ ఆదేశాలు విడుదల అవుతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.

శుక్రవారం కొమ్మినేనిని బెయిల్ రాగానే… వైసీపీ నేతలు సంబరపడ్డారు. ఇక శుక్రవారం సాయంత్రానికి కొమ్మినేని బయటకు వచ్చేస్తారని వారు సంబరాలు చేసుకున్నారు. అయితే వైసీపీ లీగల్ టీం మాత్రం అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు ట్రయల్ కోర్టు వద్ద పడిగాపులు కాసింది. అయినా బెయిల్ ఉత్తర్వులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సోమవారం కొమ్మినేనికి సంబంధించిన బెయిల్ ఉత్తర్వులను సంపాదించి… ఆయనను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేలా ఆ బృందం శ్రమిస్తోంది. మరి వారి కృషి ఫలిస్తుందో, తిరిగి మంగళవారానికి వాయిదా పడుతుందో చూడాలి.

This post was last modified on June 15, 2025 3:03 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Kommineni

Recent Posts

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

8 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

10 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

11 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

13 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

14 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

15 hours ago