Political News

తేజస్వికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

మామూలుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే గెలిచిన టీంలోని ఆటగాళ్ళకే దక్కుతుంది. అలాకాదని ఓడిన టీంలోని ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటే సదరు ఆటగాడు ఏ స్ధాయిలో ఆడుంటాడు ? అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇపుడు బీహార్ ఎన్నికల్లో జరిగిందిదే. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీయే కూటమినే వరిచింది. అయితే యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆర్జేడీ చీఫ్, మహాగట బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్ మాత్రమే. అందుకనే తేజస్వీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటున్నారు.

నిజానికి ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున అతిరథ మహారథులైన ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్రమంత్రులు, రాష్ట్రంలో మంత్రులు, ఎంపిలు, ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపిలు బీహార్ లో క్యాంపు వేసి ఎన్డీయే విజయానికి ప్రచారం చేశారు. ఇదే సమయంలో ఎంజీబీ తరపున ఎటు చూసినా కనిపించింది తేజస్వీ ఒక్కడు మాత్రమే. ఎన్నికల్లో తేజస్వీ చేసిన పోరాటాన్ని మహా భారతంలో అభిమన్యుడి పోరాటంతో మీడియా పోల్చటంలో అతిశయోక్తి ఏమీలేదు.

చివరకు ఎంజీబీలోని పార్టనర్స్ అయిన కాంగ్రెస్ నుండి కూడా పెద్దగా తేజస్వికి మద్దతు దొరకలేదు. 243 సీట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ 70 స్ధానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ కీలక నేత రాహూల్ గాంధి కూడా ప్రచారం చేసింది కేవలం 10 సీట్లు కూడా లేదు. అలాంటి ఆర్జేడీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసుకుంటు అలాగే కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్ధుల తరపున కూడా ప్రచారం చేసింది తేజస్వి ఒక్కరే. రోజుకు 20 బహిరంగ సభలు, రోడ్డుషోల్లో పాల్గొనటం ద్వారా తేజస్వి జనాలకు బాగా దగ్గరయ్యారు.

ఓటమి కూడా గౌరప్రదంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్డీయే కూటమికి 125 సీట్లు వస్తే ఎంజీబీకి 110 సీట్లు రావటం అంటే మామూలు విషయం కాదు. గెలిచుంటే 31 ఏళ్ళల్లోనే ముఖ్యమంత్రయి చరిత్ర సృష్టించే వారేమో. అయితే ఆ అవకాశం తృటిలో తప్పిపోయినా వచ్చే ఎన్నికల్లో గ్యారెంటిగా అధికారంలోకి వస్తామనే ధీమాను ఆర్జేడీ వ్యక్తం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సలహాలిచ్చి నడిపించేందుకు తండ్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లేరు. వ్యూహాలు రచించి అమలుల్లో పెట్టటానికి మరో నేత సహకారమే లేదు.

వ్యూహాలు రచించాల్సింది, వాటిని అమలు చేయాల్సింది కూడా తేజస్వి మాత్రమే. అందుకనే ఈ ఎన్నికలు తేజస్విని బాగా రాటు దాల్చే ఉంటాయి. ప్రత్యర్ధి పార్టీల్లో ఎవరేంటి, పార్టనర్స్ లో కూడా ఎవరేమిటి అనే విషయం ఈ పాటికే బాగా అర్ధమైపోయుంటుంది. కాబట్టి ఇపుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన వ్యక్తే రేపటి ఎన్నికల్లో టీంను గెలిపిస్తారేమో చూడాలి.

This post was last modified on November 11, 2020 1:57 pm

Share

Recent Posts

డింపుల్ హయతి లో ఈ టాలెంట్ కూడా ఉందా?

డింపుల్ హయతి.. ఈ పేరు వినగానే ఎవరో ముంబయి భామ అనుకుంటారు. ఆమె చేసిన పాత్రలు.. తన అప్పీయరెన్స్ అదీ…

7 minutes ago

క్యాబ్ ఎక్కెలోపే బలవంతంగా ముద్దు పెట్టిన సెక్యూరిటీ

ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని పీజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ దగ్గరకు…

35 minutes ago

ప్యారడైజ్… తెలంగాణలో ఒక పండగ మాదిరి

సినిమా అనేది యూనివర్శల్ అయినా.. లోకల్‌గా జనాలకు కనెక్ట్ అయ్యే కథాంశాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా…

55 minutes ago

కేబినెట్ మీటింగ్ కు కళ్యాణ్ సార్ వచ్చారు

ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి చంద్రబాబు…

1 hour ago

కాంచన 4 ఇంకెంత కాలం తీస్తారు

కామెడీ హారర్ అనే కొత్త జానర్ సృష్టించి, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి డబ్బులు కొల్లగొట్టే విద్యని మొదట కనిపెట్టింది…

2 hours ago

10 వేల జీతం ఇవ్వలేదని 24 కోట్ల నష్టం చేశాడు

తనకు రావాల్సిన రూ.10 వేల జీతం ఇవ్వలేదనే కోపంతో ఓ మాజీ ఉద్యోగి ఏకంగా రూ.24 కోట్ల నష్టాన్ని చూపించాడు.…

2 hours ago