తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిజంగానే ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటిదాకా అధికార పక్షంలో దర్జాగా పాలన సాగించిన కేటీఆర్… విపక్షంలోకి మారిన తర్వాత కూడా ఏమాత్రం స్పీడు తగ్గించకుండానే సాగారు. అధికార కాంగ్రెస్ పై తనదైన శైలి ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు వరుసగా ఆయనపై విచారణలు, కేసులు నమోదు అయిపోతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డికి పరువుకు భంగం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై ఓ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన ఈ కేసు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు ఆధారంగా నమోదు అయ్యింది. బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 352ల కింద ఈ కేసు నమోదు అయ్యింది. కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న కీలక సమయంలో సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది వెంకట్ ఆరోపణ. ఆ వీడిలో సోషల్ మీడియాలో వైరల్ కాగా వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి ఏ విషయంలో అయినా కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ చర్యకు ఉపక్రమించినా కేటీఆర్ ఘాటుగా స్పందిస్తున్నారు. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సమయంలోనూ ఆయన రేవంత్ రెడ్డే తనకు నోటీసులు ఇచ్చినట్లుగా అభివర్ణిస్తూ సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఏసీబీ రెండో దఫా నోటీసులు ఇచ్చిన తీరుపైనా కేటీఆర్… రేవంత్ కు సవాల్ విసిరారు. లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని, మీరు కూడా సిద్ధమేనా? అని ఆయన నేరుగా రేవంత్ నే ప్రశ్నించి కలకలం రేపారు.
సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై కేటీఆర్ పై కేసు నమోదు కావడానికి ఓ రోజు ముందుగా ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో మరోమారు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అదికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించేలోగానే ఆయనపై ఏకంగా కేసే నమోదు అయిపోయింది. ఇలా ఓ వైపు విచారణ, మరోవైపు కేసులతో కేటీఆర్ నిజంగానే ఉక్కిరిబిక్కిరి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 14, 2025 10:38 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…