గత ఏడాది ఎన్నికల్లో వైసీపీకి 40 శాతానికి అటు ఇటుగా ఓటు బ్యాంకు వచ్చింది. ఇది పార్టీ ఓడిపోయినప్ప టికీ.. అసలు పార్టీలో జవసత్వాలు తగ్గలేదని చెప్పడానికి.. పార్టిక ప్రజలు అండగా ఉన్నారని అనేందుకు ఒక ఉదాహరణ. అయితే.. ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత.. ప్రస్తుతం వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా? పెరిగిందా? అనేది కీలక అంశం. ఎప్పటికప్పుడు కొలుచుకునే సంస్కృతి వైసీపీకి లేకపోయినా.. రాజకీయ వర్గాల్లో మాత్రం వైసీపీపై భారీ అంచనాలు.. లెక్కలు కనిపిస్తున్నాయి.
ఈ పరంగా చూసుకుంటే.. వైసీపీకి ఓటు బ్యాంకు స్థిరంగా లేదన్న విషయం తెలుస్తోంది. తాజాగా కొందరు చేసిన సర్వేలే కాకుండా.. టీడీపీ అనుకూల వర్గాలు చేయించిన సర్వేల్లోనూ.. వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగా లేదని తెలుస్తోంది. గత ఏడాది 40 శాతం ఓటు బ్యాంకుతో ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీ.. కేవలం 4-5 శాతం ఓటు బ్యాంకు తేడాతోనే అధికారం కోల్పోయింది. మరి ఆ మేరకు ప్రస్తుతం ఓటు బ్యాంకు పెరిగిందా? అంటే సందేహమే. ఎందుకంటే. ఏడాదిలో వైసీపీ పెద్దగా పుంజుకోలేదు.
పైగా.. ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమం నిర్మించడంలోనూ.. విఫలమైంది. ప్రజల తరఫున గళం వినిపించడం లోనూ.. పార్టీ వెనుకబడింది. ఇవన్నీ ఇలా ఉంటే.. జగన్ వ్యవహరించిన తీరు కూడా.. ప్రజలు ఏవగించుకునే పరిస్థితిని తీసుకువచ్చింది. అసెంబ్లీకి వెళ్లకుండా మంకు పట్టు పట్టడం.. మెజారిటీ ప్రజలకు విస్మయం కలిగించడంతోపాటు..”ఈయన మారడు” అనేది జగన్‌కు పడి ముద్రగా మారింది. వాస్తవానికి.. ఎన్నికల అనంతరం మార్పు తధ్యమని అనుకున్నారు.
కానీ, ఆ మార్పు జగన్‌లో ఎక్కడా కనిపించలేదు. పైగా.. నాయకులు వీడిపోవడం.. పార్టీలో లుకలుకలు.. ఎన్నికల అనంతరం.. అందరూ జగన్ వైపే తప్పులు చూపించడం వంటివి కూడా పార్టీని జారుబండపై కూర్చోబెట్టాయి. మరోవైపు.. ఏ సమస్యను కూడా.. ఆయన ప్రజల మద్యకు కాకుండా.. కేవలం సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుని ముందుకు రావడం గమనార్హం. దీంతో వైసీపీ గ్రాఫ్ కన్నా కూడా.. ఓటు బ్యాంకు ప్రస్తుతం 2-4 శాతం మేరకు తగ్గిందన్నది తాజా అంచనా. ఇది పెద్దది కాదని వైసీపీ మౌనంగా ఉంటే.. మున్ముందు.. వాటి పక్కన సున్నాలు చేరినా ఆశ్చర్యంలేదు.
This post was last modified on June 12, 2025 5:24 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…