రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో అటు ప్రబుత్వానికి ఎంతగా కీలకమో.. ఇటు ప్రతిపక్షంగా కూడా.. ఈ సమయం వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అంతే కీలకం. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఎవరికైనా ఈ ఏడాది కాలంలో గ్రాఫ్ ఎలా ఉందన్నది ముఖ్యం. దీనిపై అధికార పార్టీ పలు రూపాల్లో సర్వేలు చేయించుకుంటోంది. ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. సర్వేలంటూ ప్రత్యేకంగా చేయడం లేదు.
అయితే.. ఎలానూ సొంత మీడియా ఉన్న నేపథ్యంలో ఆ రూపంలో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ప్రత్యేకంగా ఏడాది పాలనపై ఎక్కడా సర్వేచేయించలేదు. ఇక, సొంతగా మీడియా నుంచి రాబడుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీలో ఉన్న నాయకులు.. కీలకమైన అంశాలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా.. జగన్ అసెంబ్లీకి వెళ్లాలని కోరుకుంటున్న వైసీపీ నాయకులు 65 శాతం మంది ఉన్నారన్నది తాజా లెక్క. ఇది వాస్తవం.
కానీ.. దీనిని నమ్మడం కష్టమే అయినా.. పార్టీలో మాత్రం ఈతరహా చర్చే ఎక్కువగా జరుగుతోంది. ప్రజల తరఫున బాణి వినిపించేందుకు జగన్ అసెంబ్లీకి వెళ్లాలని చాలా మంది కోరుతున్నారు. మరికొందరు అటు జనంలోకి .. ఇటు అసెంబ్లీకి కూడా రావడం వల్లే జగన్‌కు ప్రజల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నా రు. ఇలా.. కీలకమైన ఈ విషయంపై నాయకులు స్పష్టంగానే చెబుతున్నారు. స్పష్టతతోనే చెబుతున్నారు. కానీ.. జగన్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వచ్చేది లేదని అంటున్నారు.
మరో కీలక అంశం.. ప్రత్యర్థులను టార్గెట్ చేయడం. ఈ విషయంలోనూ.. జగన్ ఆచి తూచి వ్యవహరించా ల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దీనికి కూడా65 – 70 శాతం మంది నాయకులు ఇదే భావనతో ఉన్నారు. సవాళ్లు రువ్వడం.. బెదిరింపులకు గురి చేయడం.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివాటిని గర్హిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ యాట్టిట్యూడ్ మారాలని కోరుకునే వారు కూడా కనిపిస్తు న్నారు. మొత్తానికి రెండు అంశాలపై వైసీపీ నాయకులు క్లారిటీ ఇచ్చేశారు.
This post was last modified on June 11, 2025 9:24 pm
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…