Political News

కేసీఆర్‌తో క‌విత భేటీ.. లేఖ త‌ర్వాత తొలిసారి!

బీఆర్ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌తో ఆ పార్టీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత భేటీ అయ్యారు. బుధవారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యానికే ఆమె.. త‌న భ‌ర్త అనిల్‌తో క‌లిసి కేసీఆర్ నివాసానికి వెళ్లి క‌లిశారు. అయితే.. ఇక్క‌డ రెండు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కేసీఆర్‌కు ‘డియ‌ర్ డాడీ’ అంటూ.. క‌విత రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన త‌ర్వాత‌.. తొలిసారి ఆమె ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఆ లేఖ రాసిన త‌ర్వాత‌.. అమెరికాకు వెళ్లిన ఆమె.. అనంత‌రం.. ఈ లేఖ లీకు చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అమెరికా నుంచి తిరిగి వ‌స్తూనే.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ దేవుడ‌ని.. ఆయ‌న చుట్టూ దెయ్యాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత‌.. కూడా ఆమె సూటి పోటి మాట‌ల‌తో పార్టీని ఇరుకున ప‌డేశారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అదేవిధంగా త‌న‌పై వ్య‌తిరేక ప్రచారం చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు. పార్టీలో ట్వీట్లు చేసేందుకు ప‌రిమిత‌మ‌య్యారంటూ.. కాంగ్రెస్‌పై పోరాటం ఏద‌ని కూడా ప్ర‌శ్నించారు.

ఇక‌, 2వ విష‌యానికి వ‌స్తే.. తాజాగా కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు కేసీఆర్ హాజ‌రు కావాల్సిన స‌మ‌యంలో అనూహ్యంగా క‌విత ఆయ‌న‌తో భేటీ కావ‌డం. వాస్త‌వానికి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు క‌విత‌కు ఎలాంటి సంబం ధం లేక‌పోయినా.. కేసీఆర్ కోసం నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు ఆమె హుటాహుటిన కేసీఆర్ వ‌ద్ద‌కు చేరుకున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏదేమైనా.. లేఖ అనంత‌రం బీఆర్ ఎస్‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ ప‌రిణామాలు.. త‌ద‌నంత‌ర కాలంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల అనంత‌రం.. కేసీఆర్‌ను క‌విత క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ విష‌యంపై ఏం జ‌రుగుతుందో చూడాలి. మ‌రోవైపు.. కాళేశ్వ‌రం క‌మిష‌న్ వ‌ద్ద‌కు కేసీఆర్ నేరుగా హాజ‌రు కాకుండా(బ‌హిరంగ విచార‌ణ‌) ఆయ‌న‌కు వీడియో విచార‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలిసింది.

This post was last modified on June 11, 2025 9:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago