వైసీపీ అధినేత జగన్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమరావతి రాజధానిపై ఓ రాజకీయ వ్యాఖ్యాత, జర్నలిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు.. ప్రజల్లో ఎంత తీవ్రమైన ఆవేదన కలిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరావతిలో ఉన్నవారంతా.. ‘ఆ తరహా’ మహిళలేనని సదరు వ్యాఖ్యాత కామెంట్లు చేయడం.. దానిని పూర్తిగా ఖండించకుండా.. యాంకర్ వ్యవహరించడంపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
నిజానికి నిన్నటి వరకు వైసీపీ నాయకులు.. ఇది టీడీపీ, జనసేనలకు మాత్రమే పరిమితమైందని అనుకు న్నారు. కానీ, ఇప్పుడు జన సామాన్యానికి కూడా ఈ వ్యవహారం అర్ధమైంది. దీంతో ప్రజలు తిరగబడుతు న్నారు. పైకి ఎలా ఉన్నా.. వారు చేస్తున్న చేతలు చూస్తే.. వైసీపీని,.. సాక్షి మీడియాను ఎంతగా తిట్టి పోస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఓ మహిళ తన టీవీని బయటకు తీసుకువచ్చి.. నీటితో కడగడమే కాకుండా.. ఒకటికి రెండు సార్లు లిక్విడ్ వేసి మరీ శుభ్రం చేయడం.. శుద్ధి చేసుకోవడం గమనార్హం.
ఇది మహిళల్లో ఉన్న ఆగ్రహాన్ని.. విషయ తీవ్రతను కళ్లకు కడుతోంది. ఇదేమీ చిన్న విషయం కాదు. చాలా సీరియస్‌గానే ప్రజలు చర్చిస్తున్నారు. దీనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.లేకపోతే.. వేలకు వేలు పోసి కొనుగోలుచేసుకున్న టీవీలకు దిష్టి తీయడం.. నీటితో శుద్ధి చేసుకోవడం.. లిక్విడ్ వేసు కడుక్కోవడం అంటే.. మాటలా?! ప్రత్యర్థి పక్షం ఔనన్నా కాదన్నా.. రాష్ట్ర ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారు. అలాంటి ప్రాంతంపై వేరే రూపంలో వెగటు పుట్టించేలా చేయాలన్న వైసీపీ ప్రయత్నాలను కూడా వారు “కడిగేస్తున్నారనే” వాదన వినిపిస్తోంది.