సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియాలో ఇన్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న యాంకర్.. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయం వెళ్లిన పోలీసులు.. ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ప్రత్యేక వాహనంలో ఆయనను విజయవాడకు తరలించారు. అయితే..అరెస్టు సందర్భంగా కొమ్మినేనికి.. ఏపీ పోలీసులకు వాగ్వాదం జరిగింది.
తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని.. ఏపీ పోలీసులను ఆయన ప్రశ్నించారు. అయితే.. అదంతా తాము తర్వాత చెబుతామని.. ముందు స్టేషన్‌కు రావాలని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో వివాదం ఏర్పడింది. ఎట్టకేలకు 50 నిమిషాలకు పైగా ఈ వాగ్వాదం జరిగిన దరిమిలా.. కొమ్మినేనిని ప్రత్యేక వాహనంలో పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. కాగా.. సాక్షిలో అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు.. తనకు ఎలాంటి సంబంధం లేదని కొమ్మినేని చెప్పారు.
తనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని.. తనకు ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదన్నారు. తాను ఆవ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. అమరావతిపై వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయినట్టు సమాచారం. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన మహిళలు.. ఆదివారం దాదాపు అన్ని జిల్లాల్లోనూ పోలీసులకు కొమ్మినేని సమా కృష్ణంరాజుపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. కొమ్మినేనిని అరెస్టు చేశారు.
This post was last modified on June 9, 2025 11:56 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…