Political News

కోవిడ్ వ్యాక్సిన్‌.. ఎట్ట‌కేల‌కు ఒక తీపిక‌బురు

ఇదిగో వ్యాక్సిన్.. అదిగో వ్యాక్సిన్ అనుకుంటూనే ఉన్నాం. నెల‌లు నెల‌లు గ‌డిచిపోతున్నాయి. కానీ ఎంత‌కీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌ట్లేదు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ల‌కు ట్ర‌య‌ల్స్ అన్నీ పూర్త‌య్యాయ‌ని.. అన్ని ర‌కాల అనుమ‌తులూ వ‌చ్చేశాయ‌ని.. సామాన్య జ‌నం మీద కూడా ప్ర‌యోగించేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. అంత‌ర్జాతీయంగా అన్ని దేశాల ఆమోదం పొందే దిశ‌గా ఏ వ్యాక్సిన్ అడుగులేసిన‌ట్లు క‌నిపించ‌లేదు.

ప్ర‌ఖ్యాత కంపెనీలేవీ వ్యాక్సిన్ విష‌యంలో అన్ని ద‌శ‌ల‌నూ దాటి ముందంజ వేసినట్లు సంకేతాలేమీ అంద‌లేదు. దీంతో 2020లో వ్యాక్సిన్ క‌లే అన్న అభిప్రాయం వ‌చ్చేసింది. ఇలాంటి త‌రుణంలో ఫార్మాసూటిక‌ల్ జెయింట్, కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో ముందంజ‌లో ఉన్న ఫిజ‌ర్ ఓ తీపి క‌బురు చెప్పింది.

తాము తయారు చేసిన కొత్త కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం మేర వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ల‌న్నింటినీ న‌యం చేసిన‌ట్లు ఫిజ‌ర్ ప్ర‌క‌టించింది. ఫిజ‌ర్ త‌యారు చేసిన వ్యాక్సిన్ రెండు డోస్‌ల‌ను 43 వేల మంది వాలంటీర్ల‌కు ఇచ్చారు. అందులో కోవిడ్ ఉన్న 94 మందిలో వ్యాక్సిన్ ప్ర‌భావాన్ని అధ్య‌య‌నం చేసిన అనంత‌రం.. వైర‌స్ వ‌ల్ల క‌లిగిన ఇన్ఫెక్ష‌న్లు 90 శాతం న‌యం అయిన‌ట్లుగా ఫిజ‌ర్ ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న 28 రోజుల త‌ర్వాత రెండో డోస్ ఇచ్చామ‌ని.. రెండో డోస్ ఇచ్చిన ఏడు రోజుల వ‌ర‌కు రోగికి అది సంర‌క్ష‌ణ‌గా నిలిచింద‌ని ఫిజ‌ర్ పేర్కొంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు అత్యావ‌శ్య‌క‌మైన వ్యాక్సిన్‌ను అంద‌జేసి వైర‌స్ ఉత్పాతానికి తెర‌దించే దిశ‌గా త‌మ సంస్థ కీల‌క ముందడుగు వేసింద‌ని ఫిజర్ సీసీఓ ఆల్బ‌ర్ట్ బౌర్లా తెలిపాడు. త‌మ వ్యాక్సిన్‌ను ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ సాధ్య‌మైంత త్వ‌ర‌గా స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఫిజ‌ర్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

This post was last modified on November 10, 2020 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago