Political News

నీరుకోసం భారత్ ఎదుట వేడుకుంటున్న పాకిస్థాన్!

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే మరోవైపు నీటి కోసం విజ్ఞప్తులు చేయడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం.. సింధూ జలాల సరఫరా నిలిపివేయడమే. ఇప్పుడు పాకిస్థాన్‌ను గట్టిగా వణికిస్తోంది. తమ దేశ ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఇప్పటికే నాలుగు లేఖలు భారత్‌కు పంపింది.

తాజాగా మే నెల ఆరంభంలో ప్రారంభమైన ఈ లేఖల పరంపర, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రతను సంతరించుకుంది. పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు వచ్చిన ఈ లేఖలన్నీ ఒకే ఉద్దేశంతో.. సింధూ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. భారత్ మాత్రం ప్రస్తుతం చర్చలలో ఆసక్తి చూపకపోవడమే కాకుండా, ప్రోటోకాల్ ప్రకారం ఈ లేఖలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చింది.

భారత ప్రధాని మోదీ గతంలో స్పష్టంగా చెప్పారు – “రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవు.” అంటే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా, భారత్‌పై దాడులకు వెనక నుంచి తోడ్పాటును కొనసాగిస్తూనే… నీటి కోసం కరుణాపూర్వకంగా లేఖలు రాయడం అసహ్యకరమని భావిస్తున్నారు విశ్లేషకులు.

1960లో ప్రపంచ బ్యాంకు మద్యవర్తిత్వంతో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్‌పై పాకిస్థాన్‌కు హక్కులు అప్పట్లో ఇచ్చారు. కానీ కాలం మారింది… పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ వైఖరి వల్లే ఇప్పుడు ఈ ఒప్పంద భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

This post was last modified on June 6, 2025 7:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

40 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago