Political News

`వెన్నుపోటు`.. వైసీపీ నేత‌ల‌కేనా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తీరు ఏమాత్రం మార‌డం లేద‌న్న వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది. నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఆయ‌న పిలుపునిస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పార్టిసిపేట్ చేయాల‌ని కోరుతున్నారు. ష‌రుతులు పెడుతున్నారు. ఒత్తిడి కూడా తెస్తున్నారు.దీంతో నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ మాత్రం ఎస్కేప్ అవుతున్నారు. ఆయా నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు మాత్రం జ‌గ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనిని పార్టీ నాయ‌కులు త‌ప్పుబ‌ట్టకుండా ఉంటారా? అంటే.. ఖ‌చ్చితంగా త‌ప్పుబ‌డుతున్నారు.

తాజాగా వెన్నుపోటు కార్య‌క్ర‌మంలో త‌మ‌కే త‌మ నాయ‌కుడు వెన్నుపోటు పొడిచాడంటూ.. కొంద‌రు నాయ‌కులు ఆఫ్‌దిరికార్డు గా వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. గ‌త నెల 20నే జ‌గ‌న్‌.. ఈ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న తాను కూడా ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేస్తాన‌ని.. ఏడాది అయిపోయిన నేప‌థ్యంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో తూ.చ‌. త‌ప్ప‌కుండా పాల్గొనాలని కూడా జ‌గ‌న్ సూచించారు. దీంతో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా.. అనారోగ్యంగా ఉన్నా కూడా.. నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా పాల్గొని అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మ‌రి ఇచ్చిన మాట ప్ర‌కారం.. కార్యక‌ర్త‌ల‌కు చేసిన వాగ్దానం ప్ర‌కార‌మైనా.. జ‌గ‌న్ వెన్నుపోటు కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, అస‌లు ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. క‌నీసం తాడేప‌ల్లిలోని ఇంట్లో కూర్చుని అయినా.. ప‌ర్య‌వేక్షించారా? అంటే అది కూడా లేదు. నేరుగా ఆయ‌న త‌న స‌తీమ‌ణితో క‌లిసి బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. అంతేకాదు.. పార్టీ నాయ‌కుల‌కు కూడా కొద్ది మందికే ఈ స‌మాచారం ఇచ్చారు. దీంతో అంద‌రూ జ‌గ‌న్ తాడేప‌ల్లిలోనే ఉన్నార‌ని అనుకున్నారు.

ఇక‌, మాజీ స‌ల‌హాదారు, ప్ర‌స్తుతం రాష్ట్ర వైసీపీ కోఆర్డినేట‌ర్‌గా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా ఎక్క‌డా బ‌య‌టకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా నివ్వెర పోయారు. ఈ ప‌రిణామంపై పార్టీలోనూ చ‌ర్చ వ‌చ్చింది. వెన్ను పోటు కార్య‌క్ర‌మం వైసీపీ నాయ‌కుల కోస‌మే తీసుకువ‌చ్చారా? అని ప‌లువురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రు.. పార్టీ విధానాన్ని ఎండ‌గ‌ట్టారు. గ‌తంలోనూ విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్ మెంటు విష‌యంపై చేప‌ట్టిన నిర‌సన‌కూడా పెద్ద‌గా ఫ‌లించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపైనా నాయ‌కులు చ‌ర్చించారు. పార్టీ అధినేత ముందుకు రాకుండా ఇలా త‌ప్పించుకుంటే కార్య‌క్ర‌మాలు ఎలా స‌క్సెస్ అవుతాయ‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి.

This post was last modified on June 6, 2025 6:48 am

Share
Show comments
Published by
Kumar
Tags: YS Jagan

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

21 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

30 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago