Political News

వారానికి ముందు.. వైసీపీ యాగీ!

మ‌రో వారంలో ప్ర‌భుత్వం కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. వీటికి సంబంధించి ప‌క్కా ప్ర‌ణాళిక కూడా రూపొందించారు. ఈ నెల 12 నాటికి త‌ల్లికి వంద‌నం పేరుతో ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. రైతుల‌కు ఇచ్చే అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని కూడా.. కేంద్రం ఈ నెల నుంచి ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్రం కూడా  అదే కార్య‌క్ర‌మాన్ని అదే రోజు ప్రారంభించ‌నుంది.  

ఇక‌, బ‌డి పిల్ల‌ల‌కు పుస్త‌కాల‌ను కూడా ఈ నెల 12నాటికి అందించేందుకు స‌ర్కారు సిద్ధ‌మైంది. అంటే మొత్తంగా ప్ర‌భుత్వం మ‌రో వారం రోజుల్లోనే ఆయా ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్ట‌నుంది. ఈ విష‌యం తెలిసి కూడా.. వైసీపీ నాయ‌కులు.. బుధ‌వారం రోడ్డెక్క‌డం.. నానా యాగీ చేయ‌డం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం తాలూకు పెద్ద‌లు, కూట‌మి పార్టీల నాయ‌కుల కంటేకూడా.. నెటిజ‌న్లు, సాధార‌ణ  ప్ర‌జులు ప్ర‌శ్నిస్తున్నారు.

స‌హ‌జంగా ఏ ప్ర‌భుత్వానికైనా కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇక‌, అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌ని చెబుతున్న ఏపీని పైకి తీసుకువ‌చ్చి.. కాయ‌క‌ల్ప చికిత్స చేసి.. లైన్‌లో పెట్టేందుకు స‌మ‌యం స‌రిపోయింద‌ని స‌ర్కారు పెద్ద‌లే చెబుతున్నారు. దీంతో కొన్ని కీల‌క ప‌థ‌కాల‌ను ఆర్థిక భారం అనుకున్న ప‌థ‌కాల‌ను వాయిదా వేసిన మాట నిజ‌మేన‌ని సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల మ‌హానాడు వేదిక‌గానే ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో వైసీపీ కొంత ఆలోచ‌నాత్మ‌క విధానంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా కాకుండా.. లేడికి లేచిందే ప‌రుగు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. ప్ర‌యోజ‌నం ఏంట‌న్న‌ది సాధార‌ణ ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌. స‌మ‌యం ఇవ్వ‌కుండానే.. ప్ర‌శ్నించ‌డం స‌రికాద‌ని, అయినా.. ఇప్ప‌టికే పింఛ‌న్లు పెంచారు, సిలిండ‌ర్లు ఇస్తున్నారు.. పెట్టుబ‌డులు తెస్తున్నార‌ని వారు అంటున్నారు. కాబ‌ట్టి.. వైసీపీ యాగీ చేయ‌డం స‌రికాదన్న టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 4, 2025 4:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

18 minutes ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

1 hour ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

1 hour ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

4 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

5 hours ago

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…

6 hours ago