Political News

చంద్ర‌బాబుది అకుంఠిత దీక్ష‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించ‌డ‌మే కాకుండా.. ఆ పార్టీని కేవ‌లం 11 సీట్ల‌కు ప‌రిమితం చేస్తూ.. ప్ర‌జలు ఇచ్చిన తీర్పున‌కు నేటితో(జూన్ 4, 2025) ఏడాది పూర్త‌యింది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని కూట‌మి పార్టీలు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. ఇక‌, తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో మంత్రి వ‌ర్గం కూడా భేటీ అయింది. వివిధ అంశాల‌పై చ‌ర్చ కోసం నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో తొలి చ‌ర్చ‌గా గ‌త ఏడాది ఇదే రోజు వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మంత్రులు చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా `ప్ర‌జా తీర్పున‌కు ఏడాది` పేరుతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చ‌ర్చ‌ను ప్రారంభించారు. ఏడాది కింద‌ట ఇదే రోజు రాష్ట్రంలో కొత్త చ‌రిత్ర ప్రారంభ‌మైంద‌న్నారు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అకుంఠిత దీక్ష‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ.. ప్ర‌జ‌ల కోసం నిద్రాహారాలు మాని మ‌రీ.. నిర్వ‌హించిన యాత్ర‌ల ఫ‌లితంగాను రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింద‌ని పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల నాయ‌కులు స‌హ‌క‌రించార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును మంత్రి వ‌ర్గంలోని స‌భ్యులు అభినందించారు. చంద్ర‌బాబు వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి వ‌ర్గ స‌భ్యులు గుర్తు చేశారు. గ‌త ఏడాది వ‌చ్చిన అద్భుత‌మైన ఫ‌లితం.. ప్ర‌భుత్వంపై బాధ్య‌త‌ను మ‌రింత పెంచుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌ధాని మోడీ స‌హా.. బీజేపీ నాయ‌కుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

క‌ల‌సి క‌ట్టుగా ఉంటే.. విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఎంత సుల‌భ‌మో గ‌త ఏడాది ఇదే రోజు తెలిసింద‌న్నారు. భ‌విష్య‌త్తులోనూ కూట‌మి ప‌దిలంగా ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు ఎల్ల‌ప్పుడూ సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా మ‌రికొంద‌రు మంత్రులు నారా లోకేష్ చేసిన పాద‌యాత్ర‌ను ప్ర‌స్తావిస్తూ.. విజ‌యానికి అది కూడా దోహ‌ద‌ప‌డింద‌ని పేర్కొని ఆయ‌నను కొనియాడారు.

This post was last modified on June 4, 2025 4:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago