Political News

ఏపీలో తొలిసారి కొత్త కార్పొరేష‌న్‌.. చంద్ర‌బాబు నిర్ణ‌యం

ఏపీలో పాల‌నా ప‌రంగా తీసుకువ‌చ్చిన అనేక మార్పులు ప్ర‌జ‌ల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా లాజిస్టిక్స్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఇది దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న కార్పొరేష‌న్ అని పేర్కొన్నారు. దీనివ‌ల్ల అభివృద్ధి, ఉపాధి మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాయ‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్పొరేష‌న్ రాష్ట్రంలోని పోర్టులు, మౌలిక స‌దుపాయాలు, ర‌హ‌దారుల అభివృద్ధిని మ‌రింత వేగ‌వంతం చేస్తుంద‌న్నారు.

ఫ‌స్ట్ స్టేజ్‌లో అమ‌రావ‌తి, శ్రీకాకుళం, కుప్పం, దుగ‌ద‌ర్తి ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ఈ కార్పొరేష‌న్ దృష్టి పెడుతుంద‌ని సీఎం చెప్పారు. వ‌చ్చే సంవ‌త్స‌రం.. 4 పోర్టులు, 4 హార్బ‌ర్లు పూర్తి చేయ‌నున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు. ఇక‌, ప్ర‌భుత్వ‌-ప్రైవేటు-ప‌బ్లిక్(పీపీపీ) భాగ‌స్వామ్యంతో రాష్ట్రంలోని స్టేట్ లెవిల్ రోడ్ల‌ను జాతీయ ర‌హ‌దారుల‌తో అనుసంధానం చేసేప్రాజెక్టుల‌ను కూడా.. ఈ కార్పొరేష‌న్ ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని సీఎం చెప్పారు. దాదాపు అన్ని స్టేట్ లెవిల్ రోడ్ల‌ను కూడా నేష‌న‌ల్ రోడ్ల‌తో లింకు చేయాల‌ని సూచించారు.

ప్ర‌జ‌లు ఈ ప్ర‌భుత్వంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌న్న చంద్ర‌బాబు.. వారిని సంతోష ప‌రిచేలా పాల‌న ఉండాల‌ని సూచించారు. ఎవ‌రో త‌ప్పులు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకు వ‌స్తే.. దానిని చాలా సీరియ‌స్‌గా తీసుకుంటామ‌న్నారు. ఎక్క‌డా అవినీతి, లంచాల‌కు తావు లేకుండా ప్ర‌భుత్వం ప‌నులు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది అవుతున్న స‌మ‌యంలో.. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ప‌నులు పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నామ‌ని.. ఈ ప‌నుల‌ను మ‌రింత వేగంగా పూర్తి చేసే ల‌క్ష్యంతోనే కొత్త‌గా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు వివ‌రించారు.

This post was last modified on June 4, 2025 12:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago