ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను తిరిగి స్వీకరించేందుకు కొంత సమయం పెట్టుకుంది. ఆ సమయం 2023తోనే ముగిసింది. అయితే ఇప్పటికీ జనం వద్ద పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లు ఉండిపోయాయట. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది.
ఆర్బీఐ ప్రకటన మేరకు ఇప్పటిదాకా రద్దు అయిన రూ.2 వేల నోట్లలో 98.26 శాతం నోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుకు చేరాయట. అంటే… ఇంకా 1.74 శాతం నోట్లు జనం వద్ద ఉన్నట్టు. ఈ 1.74 శాతం రూ.2 వేల నోట్ల విలువ ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.6,181 కోట్టు. నిజమా?… ఇన్నేసి కోట్ల విలువ చేసే రూ.2 వేల నోట్లు ఇంకా జనం వద్దే ఉన్నాయా? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే… కొంతమందికి రూ.2 వేల నోట్లను మార్చుకునే మార్గాలు తెలియకపోవచ్చు. లేదంటే… బడా బాబులు వాటిని తమ రహస్య నేల మాళిగల్లో దాచుకుని ఉండవచ్చు.
ఏది ఏమైనా రద్దు అయిన ఈ రూ.2 వేల నోట్లు సామాన్యం జనం వద్ద ఉన్నా, బడా బాబుల వద్ద ఉన్నా… అవి చెల్లుబాటు కావు కదా. అవును చెల్లుబాటు కావు. అంటే ప్రభుత్వానికేమీ నష్టం లేదు గానీ.. వాటిని భద్రంగా దాచుకున్న వారికే నష్టం. అయితే ఈ తరహా నష్టాలను కూడా నివారించేందుకు మరోమారు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు… మీ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఎంపిక చేసిన పోస్టాఫీసులకు వెళ్లి… మన వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. గతంలో ఇచ్చిన భారీ సమయానికే స్పందించని జనం ఇప్పుడు మాత్రం ఏం స్పందిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on June 2, 2025 9:46 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…