తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతూ ఉంటే తెలంగాణ మాత్రం అన్ని వనరులున్నప్పటికీ వెలవెలబోతోందని ఆయన అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం కంటే కూడా తక్కువ తలసరి ఆదాయం ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఏపీ అద్భుతంగా రాణిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వాస్తవంగా 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో ఏపీ కష్టాల ఊబిలో నుంచి త్వరితగతిననే బయటపడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ దుందుడుకు వైఖరి కారణంగా ఏపీ అభివృద్ధి కుంటు పడిందని చెప్పక తప్పదు. అయితే తిరిగి ఐధేళ్లకే చంద్రబాబు మరోమారు సీఎం కావడంతో ఏపీ దశ మారిపోయిందని చెప్పక తప్పదు. చంద్రబాబు రెండో సారి సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఈ 11 నెలల్లోనే ఏపీకి ఏకంగా రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే ఏకంగా 7 లక్షల మేర ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా అలా ఎక్కడి పనులు అక్కడే నిలిచిన అమరావతి నిర్మాణ పనులను చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీంతో ఏపీ ముఖచిత్రం వేగంగా మారిపోయిందని చెప్పక తప్పదు.
అటు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన అయినా…ఇటు కాంగ్రెస్ 16 నెలల పాలన అయినా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఈటెల ఆరోపించారు. తెలంగాణ కుంగుబాటుకు ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడమే వారికి సరిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పరస్పర నిందారోపణలు ఇప్పటికైనా ఆపి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే… రాజకీయ కక్షలను పక్కనపెడితే తెలంగాణ అభివృద్ధి రాకెట్ లా దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on June 2, 2025 3:37 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…