తన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. తమ డిపార్ట్మెంట్ లో ఫలానా సంస్కరణలు తెచ్చామని, ఫలితాలు బాగా వచ్చాయని చెప్పగానే చంద్రబాబు స్పందన ఆసక్తికరంగా ఉంటుందని లోకేశ్ అన్న సంగతి తెలిసిందే. సంతోషం… బాగా చేశారు ఇంకా బాగా చేయండి.. నెక్స్ట్ ఏంటి అని చంద్రబాబు చెబుతారని, కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ కూడా చంద్రబాబు ఇవ్వరని లోకేశ్ అన్నారు. ఎంత చేసినా పొంగిపోకూడదని, మరింత చేయాలనే తపన పెంపొందించుకోవాలన్న లక్షణం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని లోకేశ్ అన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మహానాడు వేదిక పై తన తనయుడు నారా లోకేష్ పై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని ఆయన అన్నారు. లోకేష్ బాగా చదువుకున్నవాడని, లోకేష్ నాలెడ్జ్ ఆధారంగా ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడని కొనియాడారు. లోకేశ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని, మామూలుగా పోయే ఈ మహానాడును 6 శాసనాలు ప్రవేశపెట్టి నూతన దిశగా తీసుకువెళ్లాడని పొగడ్తలతో ముంచెత్తారు. లోకేశ్ తన నాలెడ్జ్ ను, టెక్నాలజీని ఉపయోగిస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టాడని అన్నారు.
అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వంటి నేతతో పాటు… ఉన్నత విద్యావంతుడు, యువతరం నేత నారా లోకేష్ వంటి నేత కలయికతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది. సీనియర్ నాయకులందరికీ చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తుంటే…యువ నేతలందరికీ లోకేష్ మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని, ఇదే సరైన సమయం అని టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం, లోకేశ్ ను ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో, లోకేశ్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని చంద్రబాబు కూడా ఫిక్స్ అయ్యారని, తాజాగా ఆయన చేసిన కామెంట్లే హింట్ అని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on May 28, 2025 4:20 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…