Political News

సోమిరెడ్డిని పంపిస్తాన‌ని.. కాకాణి వెళ్లారు..!

రాజ‌కీయాలు ఇప్పుడున్న‌ట్టు రేపు ఉండ‌వు. నిన్న ఉన్న‌ట్టుగా ఈ రోజు ఉండ‌వు. ఎంత ప్ర‌త్య‌ర్థులైనా.. కేవలం ఎన్నిక‌ల వ‌ర‌కు.. మాత్ర‌మే ప‌రిమితం కావాలి. గ‌తంలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు అనేక మంది ఇదే సూత్రాన్ని పాటించారు. అమ‌లు చేశారు. ముఖ్యంగా ఇదే జిల్లాకు చెందిన క‌మ్యూనిస్టు యోధుడు పుచ్చ‌లప‌ల్లి సుంద‌ర‌య్య ఈ విష‌యంలో ఆద‌ర్శం. మ‌రి అలాంటి గ‌డ్డ‌ పై రాజ‌కీయాలు చేసే నాయ‌కులు ఎలా ఉన్నారు? అంటే.. ప్ర‌శ్నార్థ‌క‌మే.

ఐదు సార్లు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారంటే.. స‌ద‌రు నాయ‌కుడు ఇంకా మంచి ల‌క్ష‌ణాల‌తోనే ముందుకు సాగాలి. పైగా.. సంస్కారవంతమైన ఫ్యామిలీలో ఎలాంటి మ‌చ్చ‌లు మ‌ర‌క‌లు లేని కుటుంబం నుంచి వ‌చ్చిన కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి వంటివారు.. మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. ఎందు కంటే.. ఆయ‌న ఇప్పుడు జోరుగా ట్రోల్ అవుతున్నారు. “సోమిరెడ్డిని పంపిస్తాన‌ని.. కాకాణి వెళ్లారు” అంటూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీనికి కార‌ణం.. 2022లో టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిపై కాకాణి చేసిన వ్యాఖ్య‌లే. అప్ప‌ట్లో సోమిరెడ్డిని జైలుకు పంపిస్తానంటూ… కాకాణి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు జైలుకే పంపిస్తాన‌ని.. కుటుంబానికి చేరువ‌గానే ఉంచుతాన‌ని.. త‌న కుమారుడు రోజూ వ‌చ్చి చూసుకునే వీలు క‌ల్పిస్తాన‌ని కూడా ఎద్దేవా చేశారు. వీటిని ఆనాడు సోమిరెడ్డి స‌వాల్ చేశారు. ద‌మ్ముంటే పంపించు అని కూడా అన్నారు. కానీ.. ఎక్క‌డా సోమిరెడ్డి దొర‌క‌లేదు.

క‌ట్ చేస్తే.. మూడేళ్లు కూడా తిర‌గ‌కుండానే.. సోమిరెడ్డిని పంపిస్తాన‌ని చెప్పిన జైలుకే తాజాగా సోమవారం రాత్రి కాకాణి వెళ్లాల్సి వ‌చ్చింది. గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కాలు, ఎస్సీఎస్టీల కేసులో సుదీర్ఘ కాలం ప‌రారీలో ఉన్న కాకాణి అరెస్టుకావ‌డంతో ఆయ‌న‌కు రిమాండ్ విధిస్తూ.. స్థానిక కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో కాకాణి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీనిని చూసిన వారు.. పైవిధంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, “కాల మ‌హిమ అంటే ఇదే!” అని ప‌రిశీల‌కులు అంటున్నారు.

This post was last modified on May 27, 2025 2:24 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

1 hour ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago