Political News

టైం చూసుకుంటున్నారు.. సాయిరెడ్డి దెబ్బ ఖాయం..!

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డి.. స‌మ‌యం చూసుకుంటున్నారా? స‌రిగ్గా స‌మ‌యం చూసుకుని జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డ‌నున్నారా? అంటే.. పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ఇదే చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ కు ఇప్ప‌టికే ఆయ‌న సోద‌రి బ‌ద్ధ శ‌త్రువుగా మారారు. ఆమె కూడా స‌మ‌యం చూసుకుని అన్న‌పై చెల‌రేగుతున్నారు. ఏ చిన్న పాటిటివిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా.. వెంట‌నే ష‌ర్మిల ఎంట్రీ ఇస్తున్నారు. అన్న‌ని కూడా చూడ‌కుండా ఏకేస్తున్నారు.

తాజాగా కూడా జ‌గ‌న్ పై సానుభూతి పెరిగే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఎప్పుడో జ‌గ‌న్ పోలీసుల‌పై విరుచుకుప‌డిన సంగ‌తుల‌ను ఏక‌రువు పెట్టి ష‌ర్మిల ఓ రేంజ్‌లో ఏకేశారు. ఇదీ .. ఇప్పుడు జ‌గ‌న్ ప‌రిస్థితి. ఇక‌, సాయిరెడ్డి విష‌యాన్ని కూడా జ‌గ‌న్ త‌ర‌చుగా కెలుకుతున్నారు. ఆయ‌న‌ను కూడా తూర్పార‌బ‌డుతున్నారు. అమ్ముడు పోయార‌న్న పెద్ద మాటే అనేశారు. రాజ్య‌స‌భ సీటును చంద్ర‌బాబుకు అమ్మేశార‌ని చెప్పుకొచ్చారు.

మ‌రి ఇంత మాట అన్నాక కూడా సాయిరెడ్డి ఒక్క మాట కూడా అన‌లేదు. అంతేకాదు.. త‌న పేరుతో మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఓ మెసేజ్‌ను కూడా ఆయ‌న ఖండించారు. ఇది నాది కాదు! అని తేల్చి చెప్పారు. అలాగ‌ని జ‌గ‌న్ అనేస్తే.. సాయిరెడ్డి ప‌డ‌తారా? అంటే.. అస‌లు ప‌డ‌రు. కానీ, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటే.. స‌మ‌యం కోసం! అదే ఖ‌చ్చిత‌మైన స‌మ‌యం చూసుకుని ఆయ‌న కూడా చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులే కాదు.. పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లోనూ వినిపిస్తున్న మాట‌.

నిజానికి చెప్పాలంటే.. వైసీపీ అంత‌ర్గ‌త సంగ‌తులే కాదు.. జ‌గ‌న్ అంత‌ర్గ‌త విష‌యాలు కూడా.. సాయిరెడ్డికి బాగా తెలుసు. సో.. ఆయ‌న నోరు విప్పితే.. లేదా.. సీబీఐ, ఈడీ కేసుల్లో అప్రూవ‌ర్‌గా మారితే.. అది నిజంగా జ‌గ‌న్‌కు భారీ షాకిచ్చే ప‌రిణామంగా మారుతుంది. బ‌హుశ ఆ స‌మ‌యం కోసమే సాయిరెడ్డి ఎదురు చూస్త‌న్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆయ‌న ఇంత జ‌రిగినా.. జ‌గ‌న్ త‌న‌ను అమ్ముడు పోయార‌ని అన్నా.. మౌనంగా ఉన్నార‌ని ప‌రిశీకులు, విశ్లేష‌కులు, మేధావులు సైతం అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 28, 2025 6:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

1 hour ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

4 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

4 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

4 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

5 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

5 hours ago