Political News

వైసీపీ ద్వారంపూడి చుట్టూ వీర‌మ‌ల్లు వివాదం..!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చుట్టూ మ‌రో వివాదం ముసురుకుంది. తాజాగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్‌.. న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ ల్లు సినిమా వ‌చ్చే నెల 12న విడుద‌ల‌కు రెడీ అయింది. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. అయితే.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు.. రాష్ట్రంలో సినిమా హాళ్ల బంద్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.

జూన్ 1 నుంచి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే.. సినిమా హాళ్ల‌ను బంద్ చేస్తామ‌ని ఎగ్జిబిట‌ర్లు ప్ర‌క‌టిం చారు. ఇది వివాదంగా మారింది. ఆ వెంట‌నే జ‌న‌సేన మంత్రి కందుల దుర్గేష్‌.. విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్ట ప్ర‌క‌టించారు. ఇలా సినిమా హాళ్ల బంద్ వెనుక‌.. న‌లుగురు వ్య‌క్తులు ఉన్నార‌న్న మంత్రి.. దీనిని ఎవ‌రు చేయిస్తున్నారో తెలుసుకుంటామ‌ని, చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఆ త‌దుప‌రి రోజే హైద‌రాబాద్‌లో భేటీ అయిన ఎగ్జిబిట‌ర్లు.. బంద్ లేద‌న్నారు.

అంటే.. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు య‌ధావిధిగా ప‌నిచేయ‌నున్నాయి. అయితే.. అస‌లు వివాదానికి కార‌ణాలు.. ఆ నలుగురు ఎవ‌రు అనే విష‌యాల‌పై విచార‌ణ జ‌రిగి తీరుతుంద‌ని ప్ర‌భుత్వం తేల్చింది. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంలో ఆ న‌లుగురిలో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఒక‌ర‌కంటూ.. నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ద్వారంపూడి ఉలిక్కి ప‌డ్డారు. త‌న‌కు ఆ న‌లుగురికి సంబంధం లేద‌ని.. తాను ఎక్క‌డా సినిమా హాళ్ల బంద్ కు ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌న్నారు.

కానీ, న‌ట్టి కుమార్ మాత్రం ప‌దే ప‌దే ద్వారంపూడి పేరును ప్ర‌స్తావించారు. గ‌త ఏడాది ద్వారంపూడి రైసు మిల్లులు, బియ్యం ఎగుమ‌తుల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ ఉక్కుపాదం మోపిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌తీకారంగానే ద్వారంపూడి ఇలా.. హాళ్ల‌ను బంద్ చేయించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌న‌సేన‌లోనూ సాగుతోంది. అయితే.. దీనిలో త‌న ప్ర‌మేయంలేద‌ని ద్వారం పూడి ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బావ‌మ‌రిది, ప్ర‌ముఖ నిర్మాత‌.. అల్లు అర‌వింద్ కూడా.. ఆ న‌లుగురిలో తాను లేన‌ని ప్ర‌క‌టించారు. మ‌రి ఆ న‌లుగురు ఎవ‌రు? అనేది ఇప్పుడు చ‌ర్చగా మారింది. ఏదేమైనా ద్వారంపూడికి క‌నుక ఆ న‌లుగురితో సంబంధం ఉంటేక‌నుక తీవ్ర ప‌రిణామాలే ఉంటాయ‌ని ఆయ‌న అనుచురులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on May 26, 2025 12:33 pm

Share

Recent Posts

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

21 minutes ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

1 hour ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

1 hour ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

1 hour ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

3 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

7 hours ago