Political News

బాబు విందు.. ఘుమ‌ఘుమ‌లు!

సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భ‌వ‌నం.. గృహ ప్ర‌వేశం ఆదివారం తెల్ల‌వారుజామును జ‌రిగింది. శ‌నివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైద‌రాబాద్‌కు.. అక్క‌డ నుంచి బెంగ‌ళూరుకు వ‌చ్చిన ఆయ‌న రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న నిద్ర‌కూడా పోకుండానే.. గృహ ప్ర‌వేశ ఘ‌ట్టంలో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయ‌కులు, మంత్రులు, వీఐపీల‌ను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తుల నుంచి హైకోర్టు న్యాయ‌మూర్తుల వ‌ర‌కు అంద‌రినీ ఆహ్వానించారు. ఇక‌, ఈ గృహ ప్ర‌వేశ ఘ‌ట్టంలో ష‌డ్ర శోపేత మైన విందును ఇస్తున్నారు. ప్ర‌ధానంగా రెండు ర‌కాలుగా విందు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, మంత్రుల‌కు వేరుగా.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు వేరుగా వంట‌కాలు సిద్ధం చేయిస్తున్నారు. వీటిలో తేడా లేక‌పోయినా.. వీవీఐపీల‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలిసింది.

ఇక‌, వంట‌కాల విష‌యానికి వ‌స్తే..

చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, ఆలూ సమోసా, జొన్న పిండి స‌మోసా, టమోటా రైస్, వెజ్‌ బిరియాని, రైతా, మామిడి కాయ‌ల‌తో త‌యారు చేసిన అన్నం, మఫ్రూమ్(పుట్ట‌గొడుగులు) గుజ్జు కూర, బెండకాయ ఫ్రై, గుత్తివంకాయ మసాలా, వడపులు, ఆలూ ఫ్రై, ట‌మాటా బీర‌కాయప‌చ్చ‌డి, వైట్ రైస్, ఘీరైస్, లెమ‌న్ రైస్‌, ఎల్లో రైస్‌, ప‌ర‌మాన్నం, రసం, సాంబార్, గోంగూర పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటుగా ఆవకాయ కూడా ఏర్పాటు చేశారు. ఇక‌, ప్ర‌త్యేక వంట‌కంగా.. క్యారెట్‌ హల్వా వ‌డ్డించారు. చివ‌రిలో ఐస్‌క్రీమ్, పాన్ అందించారు.

This post was last modified on May 25, 2025 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

14 minutes ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

14 minutes ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

1 hour ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

3 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

4 hours ago

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…

5 hours ago