Political News

వైసీపీ టాక్‌: సాయిరెడ్డిని కెలికి త‌ప్పు చేశారు ..!

వైసీపీ కీల‌క మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డిపై రెండు రోజుల కింద‌ట వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే..ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు మైలేజీఇవ్వ‌క‌పోగా.. పార్టీలో నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. సాయిరెడ్డిని కెలికి త‌ప్పు చేశారు స‌ర్‌! అంటూ ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నాయకులు తాజాగా జ‌గ‌న్ చెవిలో వేసిన‌ట్టు తెలిసింది. తాజాగా ఇద్ద‌రు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే నాయ‌కులు ఆయ‌న‌నుక‌లిసారు.

ప్ర‌స్తుతం సాయిరెడ్డి సైలెంట్గా ఉన్నార‌ని.. ఆయ‌న వైలెంట్ గా మారితే మ‌న‌కే ఇబ్బందుల‌ని కూడా.. జ‌గ‌న్‌కు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. మ‌ద్యం కుంభ‌కోణంలో సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలుస్తున్న‌ట్టు వారు స‌మాచారం ఇచ్చారు. ఇదే జ‌రిగితే.. ఇబ్బందులు పెరుగు తాయ‌ని.. చెప్పుకొచ్చార‌ని తెలిసింది. మీరు బాగానే ఉంటారు. దీనిపై మాకు కూడా న‌మ్మ‌కం ఉంది. కానీ, కేడ‌ర్ దెబ్బ‌తింటుంది అని గుంటూరుకు చెందిన ఓ వృద్ధ నేత జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు ద్వారా తెలిసింది.

అయితే.. దీనికి జ‌గ‌న్ చిత్ర‌మైన స‌మాధానం చెప్పార‌ని అంటున్నారు. అన్నీ చూడాల‌న్నా.. ఏం జ‌రిగినా త‌ట్టుకునే వారే మ‌న‌కు కావాలి. రేపు అధికారంలోకి వ‌చ్చాక వారికే ప్రాధాన్యం ఉంటుంది అని న‌వ్వుతూ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌తో వైసీపీలో జ‌గ‌న్ వ్య‌వ‌హారం మ‌రోసారి ర‌చ్చ‌గా మారింది. ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా మ‌రింత దూరం అవుతార‌ని అంటున్నారు. ఇది స‌రైన విధానం కాద‌ని కూడా చెబుతున్నారు.

పార్టీలో ఉన్న నాయ‌కుల‌కు భ‌రోసా ఇవ్వాలంటే.. వెళ్లిపోయిన వారిని సాధ్య‌మైనంత వ‌ర‌కు విమ‌ర్శించ కుండా ఉంటేనే బెట‌ర్ అన్న విధంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ‌తంలో కేసుల‌తో సంబంధాలుఉన్న వారి విష‌యంలో అయితే.. అస‌లు సాధ్య‌మైనంత వ‌ర‌కు మౌనంగా ఉంటేనే బెట‌ర్ అనికూడా వ్యాఖ్యానిం చిన‌ట్టు తెలిసింది. కానీ.. జ‌గ‌న్ వినే ర‌కం కాదు కాబ‌ట్టి.. వారు చెప్ప‌డం వ‌రకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు.

This post was last modified on May 24, 2025 9:52 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago