రాజ రాజ చోర, స్వాగ్ దర్శకుడు హసిత్ గోలి, మాస్ మహారాజ రవితేజ కలయికలో ఒక సినిమా రూపొందబోయే సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కానీ స్క్రిప్ట్ లాక్ చేసినట్టు సమాచారం. అయితే ఇందులో హీరో పాత్ర ట్రాన్స్ జెండర్ గా ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. నిజమనుకున్న అభిమానులు టెన్షన్ కూడా పడ్డారు. ఎందుకంటే ఇప్పటి వయసు, ఇమేజ్ కి అలాంటి క్యారెక్టర్లు సూట్ కావు సరికదా ఇంకా చెప్పాలంటే రివర్స్ కొడతాయి.
అయితే అదంతా వట్టి పుకారేనని తేలిపోయింది. నిజానికి రవితేజ ఇలాంటి రిస్కులు చేయాల్సిన ఏజ్, స్టేజిలో లేరు. ఏదో ఒక పాట లేదా చిన్న సీన్ అంటే ఇబ్బంది లేదు. చంటబ్బాయిలో చిరంజీవి, టాప్ హీరోలో బాలకృష్ణ నుంచి యువరాజులో మహేష్ బాబు దాకా అందరూ సరదాగా ఒక రెండు సన్నివేశాల్లో అలా నటించిన వాళ్లే. ఫుల్త్ లెన్త్ రోల్స్ టయర్ 1 స్టార్లు చేయరు. అంతెందుకు లైలాలో విశ్వక్ సేన్ ఇలాంటి ప్రయోగం చేసి దారుణ విమర్శలు మూటగట్టుకున్నాడు.
సో ఏ కోణంలో చూసినా రవితేజ ఇలాంటి అక్కర్లేని ప్రయోగాలు చేయడు గాక చేయడు. హసిత్ గోలి కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. విభిన్నమైన హాస్యంతో క్రైమ్ మిక్స్ చేసి నవ్విస్తాడు. రవితేజకూ అలాంటి స్టోరీ సెట్ అయ్యిందట. స్వాగ్ లో చేసిన స్క్రీన్ ప్లే ఎక్స్ పరిమెంట్లు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈసారి వాటి జోలికి వెళ్లకుండా ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ రాసుకున్నట్టు తెలిసింది. సో అర్థం లేని గాసిప్ గురించి క్లారిటీ వచ్చేసినట్టే.
ఇక ఇరుముడి విషయానికి వస్తే ఆగస్ట్ 21 విడుదల కాబోతున్న ఈ సినిమా మీద రవితేజ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఈసారి హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణ కూడా ఖుషి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో రూటు మార్చి ఎమోషన్స్ మిస్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ రాసుకున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on June 11, 2026 5:27 pm
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…