Movie News

విపరీతమైన ప్రేమ కాసులు కురిపిస్తుందా

వన్ సైడ్ లవ్ తెలుగు తెరకు కొత్త కాదు. కొన్ని వందల సార్లు చూసుంటాం. కాకపోతే చెప్పే విధానంలో దర్శకులు అనుసరించే శైలి వల్ల ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుంది. ఫలితాలు కూడా దానికి తగ్గట్టే మారుతూ ఉంటాయి. సుకుమార్ ఆర్య తర్వాత ఇందులో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అమ్మాయికి ముందు ఇష్టం లేకపోయినా ఎలాంటి హానీ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఎలా ప్రేమించేలా చేసుకోవాలో అల్లు అర్జున్ ద్వారా చూపించిన విధానం బ్లాక్ బస్టర్ అందించింది.

అర్జున్ రెడ్డిలో కూడా విజయ్ దేవరకొండ తొలుత ఒకవైపు ప్రేమను మొదలుపెట్టి తర్వాత షాలిని పాండేని తన ప్రేమని పెంచుకునేలా చేస్తాడు. జూన్ 19 విడుదల కాబోతున్న దీవానా ఇదే రూటు పట్టినట్టు కనిపిస్తోంది. ఉద్యోగం చేసుకునే అమ్మాయి వెనుక ఒక కుర్రాడు ప్రేమ అంటూ వెంటపడతాడు. ఆమె అంటే పిచ్చి ప్రాణం. కానీ తనకేమో ఇష్టం ఉండదు. ఇంటా బయటా ఎన్నో దెబ్బలు, అవమానాలు తింటాడు. అయినా చలించదు. తర్వాత ఏమైందో జూన్ 19 చూడమంటున్నారు.

పవన్ కళ్యాణ్ సుస్వాగతం ఛాయల్లో కనిపిస్తుప్పటికీ దీనికి కొంచెం వైల్డ్ టచ్ ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ సంఘీశెట్టి. కాకపోతే ఇలాంటివి కొత్త కాదు. రాజశేఖర్ ఓం కూడా ఇదే బాపతే. కానీ టీమ్ మాత్రం కల్ట్ లవ్ స్టోరీ లాగా నిలిచిపోతుందని, కన్నీళ్లు పెట్టకుండా బయటికి రాలేరని నమ్మకంగా చెబుతోంది. ఇన్నిసార్లు చూసేసిన వన్ సైడ్ లవ్ ని 2026 ప్రేక్షకులకు తగ్గట్టు ఎలా మలచారో చూడాలి. ఆల్రెడీ బల్లి పిల్ల అనే సాంగ్ యూత్ లో వైరల్ అయ్యింది.

వచ్చే వారం సమంత మా ఇంటి బంగారం, విజయ్ ఆంటోనీ వంద దేవుళ్ళు, మలయాళం డబ్బింగ్ బాలన్ తో పోటీ పడుతున్న దీవానాకు స్కోప్ అయితే ఉంది. కాకపోతే యునానిమస్ టాక్ తెచ్చుకోవాలి. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కావడంతో స్వయంగా అల్లు అరవింద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు. విశ్వక్ సేన్ అతిథిగా వచ్చి కాసింత నవ్వులు పంచాడు. హీరో హర్షిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. చూడాలి ఈ దివానా ఏం చేస్తాడో.

This post was last modified on June 11, 2026 5:04 pm

Share

Recent Posts

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

2 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

3 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

3 hours ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

3 hours ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

3 hours ago

అమ్మా… నాన్న…. ఓ బుడ్డోడు

సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…

4 hours ago