పెద్ది టాక్స్, డిస్కషన్ల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న మాట వాస్తవం. కొన్ని ఏరియాలలో పుష్ప 2ని దాటేసిన వైనం నెంబర్లలో కనిపిస్తోంది. ప్రమోషన్ల పరంగా టీమ్ పెద్దగా సౌండ్ చేయడం లేదు. అప్పలసూరిగా మెప్పించిన జగపతిబాబు కెరీర్ లో మొదటిసారేమో అనిపించేలా, పోస్ట్ రిలీజ్ తర్వాత మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ది విశేషాలు పంచుకుంటున్నారు. నెగటివ్ చేసిన వాళ్లకు తగిన సమాధానమిస్తూ ఆసక్తి పెంచేలా ప్రయత్నం చేస్తున్నారు.
విడుదలకు ముందు హడావిడి చేసిన బోమన్ ఇరానీ సైలెంట్ అయిపోయారు. విడుదలకు ముందు ప్రతి చోట కనిపించిన దివ్యెందు శర్మ తర్వాత ఒక వీడియో బైట్ కూడా ఇవ్వలేదు. జాన్వీ కపూర్ సంగతి సరేసరి. ఊహించని వివాదం తన పాత్రకు రావడంతో సైలెంట్ అయిపోయింది. కమెడియన్ సత్యకు స్కోప్ తక్కువ కాబట్టి ఏం మాట్లాడలేడు. బెంగళూరు థియేటర్ లో స్పెషల్ షో చూసిన తర్వాత శివరాజ్ కుమార్ తన పనుల్లో తాను బిజీ అయిపోయారు. ఫైనల్ గా కనిపిస్తోంది ఒక్క జగపతిబాబు మాత్రమే.
నిజానికి పెద్ది, అప్పలసూరి మధ్య చాలా సీన్లు ఎడిటింగ్ లో ఎగిరిపోయాయి. ఈ మాట జగ్గు భాయ్ స్వయంగా చెప్పారు. వాటిని నెట్ ఫ్లిక్స్ లో అతికిస్తారా లేక ఈ వీకెండ్ లో థియేటర్ లో జోడిస్తారా అనేది టీమ్ చెప్పడం లేదు. విచిత్రం ఏమిటంటే సోషల్ మీడియాలో జగపతిబాబు పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. రామ్ చరణ్ తప్ప ఎవరూ హైలైట్ కాలేదు. తన కష్టాన్ని తానే మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో జగ్గు భాయ్ రంగంలోకి దిగిపోయారు.
నెక్స్ట్ సక్సెస్ మీట్ చేస్తారనే టాక్ ఉంది. అదేదో ఆదివారం లోపు చేస్తే బెటర్. టికెట్ రేట్లు కూడా ఆ రోజు నుంచే సాధారణ స్థితికి రాబోతున్నాయి. ఫ్లాప్ టాక్ రానప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా పబ్లిసిటీ నిత్యం జరుగుతూ ఉండాలి. కలెక్షన్ల పోస్టర్లు ఒకటే సరిపోవు. ఏదో ఒక కంటెంట్ తో జనాన్ని పలకరిస్తూ ఉంటే ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ఆటోమేటిక్ గా వసూళ్లు పెరుగుతాయి. ఆ దిశగా టీమ్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి.
This post was last modified on June 11, 2026 8:55 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…