Political News

మహానాడు ఆపమని మాస్క్ లు వేసుకుని వచ్చారు

ఏపీ అధికార కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడుకు మ‌రో మూడురోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నెల 27 నుంచి 29 మ‌ధ్య మూడు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు పార్టీ నాయ‌కులు ఏర్పాట్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేస్తున్నారు. అది కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా.. క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్నారు. క‌డ‌ప‌లోని జ‌గ‌న్ సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం క‌మ‌లాపురంలో మూడు రోజుల ప‌సుపు పండ‌గ‌కు స‌న్నాహాలు సాగుతున్నాయి. అయితే.. ఇంత‌లోనే వైసీపీ ఈ మ‌హానాడుపై విషం చిమ్మే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

తాజాగా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ అదితి సింగ్‌కు.. మాజీ ఎమ్మెల్యే, జ‌గ‌న్ మేన‌మామ‌ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి స‌హా ప‌లువురు నాయ‌కులు భారీ విన‌తి ప‌త్రం ఇచ్చారు. “టీడీపీ నిర్వ‌హిస్తున్న‌.. మ‌హానాడును అడ్డుకోండి. జ‌ర‌గ‌కుండా ఆదేశాలు ఇవ్వండి. ఇప్ప‌టికే ఇచ్చిన అనుమ‌తులు త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయండి..” అని స‌ద‌రు విన‌తి ప‌త్రంలో పేర్కొన్నారు. అంతేకాదు.. మ‌హానాడు కు వ‌చ్చే వాహ‌నాల‌ను కూడా అనుమ‌తించ‌రాద‌ని.. ఇప్ప‌టికే ఇచ్చిన లైసెన్సుల‌ను ర‌ద్దు చేయాల‌ని కూడా కోరారు. మ‌హానాడు నిర్వ‌హిస్తే.. మ‌హా ప్రమాదం కొని తెచ్చుకున్న‌ట్టేన‌ని కూడా వ్యాఖ్యానించారు. దీనిని జాయింట్‌ క‌లెక్ట‌ర్ స్వీక‌రించారు.

ఎందుకు యాగీ?

వైసీపీ వాద‌న ప్ర‌కారం.. రాష్ట్రంలోను, దేశంలోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు మ‌హానాడు నిర్వ‌హిస్తే.. ఈ కేసుల తీవ్ర‌త మ‌రింత పెరుగుతుంద‌ని.. త‌ద్వారా.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని అంటున్నా రు. ఇదే విష‌యాన్ని విన‌తి ప‌త్రంలోనూ పేర్కొన్నారు. అయితే.. వాస్త‌వానికి ప్ర‌స్తుతం క‌రోనా కేసులు ఒక‌టి అరా క‌నిపించినా.. దేశ‌వ్యాప్తంగా ఎలాంటి అలెర్ట్ ప్ర‌క‌టించ‌లేదు. పైగా ఇదేమీ అత్యంత ప్ర‌మాద‌క‌ర వైర‌స్ అని ఎవ‌రూ చెప్ప‌లేదు. కేంద్రం కూడా.. దీనిని సీరియ‌స్ ఎఫెక్టెడ్ వైర‌స్‌గా ప్ర‌క‌టించ‌లేదు.

అయినా కూడా.. వైసీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా మ‌హానాడుకు మోకాల‌డ్డే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే క‌రోనా బూచిని చూపిస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ పుంజుకుంటుంద‌న్న భ‌యంతోనే వైసీపీ నాయ‌కులు యాగీ చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే.. తాము హైకోర్టులో కూడా ఈ విష‌యంపై పిటిష‌న్ వేస్తామ‌ని వైసీపీ నాయ‌కులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 24, 2025 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

41 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago