ఎస్! ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. దీనిలో కీలక పాత్ర వహించిన వారిని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. వీరు ఇస్తున్న సమాచారం ఆధారంగా.. మరింత మందిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మరో పేరు బాల్ రెడ్డి అని వినిపిస్తోంది. ఈయన ఎవరు ఏంటనేది .. సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇవన్నీ చూస్తే.. అంతిమంగా జగన్ అరెస్టుకు మార్గం సుగమం చేసుకుంటున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
అయితే.. జగన్ అరెస్టు విషయంలో రెండు రకాలుగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. సాధారణంగా ఒక రాజకీయ నేతను, ముఖ్యంగా మాజీ సీఎంను అరెస్టు చేస్తే.. ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తుతుంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయనను అరెస్టు చేస్తున్నారన్న చర్చ కూడా ప్రజల మధ్యకు వస్తుంది. గతంలో తమిళనాడులో జయలలితను కరుణానిధి అరెస్టు చేసి జైలుకు పంపించినప్పుడు కూడా ఇతే తరహా చర్చ సాగింది.
దీంతో అది కరుణానిధికి మైనస్ అయి.. జయలలిత విజయానికి బాటపరిచింది. ఏపీలోనూ.. గత రెండేళ్ల కిందట ఇదే జరిగింది. చంద్రబాబు అరెస్టుతో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న జనసేన -టీడీపీ చేతులు కలిపి.. క్షేత్రస్థాయిలో వైసీపీని ఓడించాలన్న కసిని పెంచాయి. మరి .. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందా? అనేది చర్చ. అయితే.. అలా రాకుండా.. ఉండేందుకు.. పక్కాప్రణాళికతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంపై ప్రజల్లోనూ వ్యతిరేక ప్రభావం పడింది. నాణ్యమైన లిక్కర్‌ను లేకుండా చేసి.. చీప్ లిక్కర్‌ను తీసుకువచ్చి.. తమ ప్రాణాలు హరిస్తున్నారని మందుబాబులు కూడా ఉద్యమించారు. ఇప్పుడు అదే కేసును అదే కోణంలో ప్రజలకు వివరించి.. జగన్‌ను దోషిగా నిలబెట్టి.. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదన్న కోణంలో ప్రజలను ఆలోపించేలా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో సింపతీ వచ్చే అవకాశం లేదు.
ఇక, రెండోది ఇప్పటికిప్పుడు ఎలానూ ఎన్నికలు లేవు. పైగా.. క్షేత్రస్థాయిలో బలమైన వైసీపీ నాయకులు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఇప్పుడు అరెస్టు చేసినా.. రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండదని .. పోరాడే నాయకులు కూడా లేరని చంద్రబాబు అంచనాలు వేసుకున్నారు. సో.. ఈ రెండు కారణాలపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి.. కేంద్రంతోనూ చర్చించారు. జగన్‌పై ఉన్న వివాదాలను కేంద్రానికి వివరించారు. అక్కడ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది.
This post was last modified on May 24, 2025 5:14 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…