ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణం కేసులో త్వరలోనే ఓ కీలక పరిణామం జరగబోతోందని కూటమి పెద్దలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వైసీీపీ హాయాంలో జరిగిన ఈ కుంభకోణం మొత్త ఆ పార్టీ అదినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని… ఇప్పటిదాకా అరెస్టు అయిన దాదాపుగా అందరూ నిందితులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు కూడా జగనేనని ఇప్పటికే ఆధారాలు లభించినట్లుగా సమాచారం. దీంతో ఈ కేసులో జగన్ ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ అరెస్టుకు జగన్ కూడా మెంటల్ గా ప్రిపేర్డ్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. గురువారం తాడేపల్లి కేంద్రంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ లిక్కర్ స్కాం గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. లిక్కర్ స్కాం తన హయాంలో జరగనే లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయినా లిక్కర్ సేల్స్ తగ్గించి… ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే… కంపెనీలకు నష్టమే కదా…మరి నష్టాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వ పెద్దలకో, ప్రతినిధులకో ఎందుకు ముడుపులు ఇస్తాయని ఆయన ప్రశ్నించారు. అసలు లిక్కర్ స్కాం జరిగింది చంద్రబాబు హయాంలోనేనని చెప్పిన జగన్.. ఇప్పుడు చంద్రబాబు ఆ కేసులో బెయిల్ పై ఉన్నారని చెప్పుకొచ్చారు.
చివరగా మీడియా సమావేశాన్ని ముగించే సందర్బంగా మిమ్మల్ని అరెస్టు చేస్తారంటగా అని ఓ మీడియా ప్రతినిది ప్రశ్నించగా… ”చేయనీ… నేనేమీ ఎక్కడికీ పారిపోలేదు కదా. ఇక్కడే తాడేపల్లిలోనే ఉన్నాను కదా…ఏం జరిగినా ఆ దేవుడే చూస్తూ ఉంటాడు కదా” అంటూ జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అదే తప్పు ఇతరుల హయాంలో జరిగిందని ప్రొజెక్ట్ చేస్తారని జగన్ ఆరోపించారు. అందులో బాగంగానే…తన హయాంలో జరిగిన లిక్కర్ స్కాం నుంచి జనాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక కూటమి సర్కారు అనుకుంటున్నట్లుగానే తాను అరెస్టు అయితే ఎలా అనే అనుమానం వచ్చిందో, ఏమో తెలియదు గానీ…తన హయాంలోని లిక్కర్ పాలసీ, రాష్ట్ర అప్పులకు సంబంధించిన సమాచారం, కూటమి పాలనలో జరిగిన అరెస్టులు, హత్యలు… ఇలా పలు రకాల డాక్యుమెంట్లను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో పొందుపరుస్తున్నట్లు ప్రకటించారు. ఆ పత్రాలు వైసీపీ ఖాతాల్లోనూ అందుబాటులో పెడుతున్నట్లు చెప్పారు. జగన్ మాటలు, చేతలు చూస్తుంటే.. కూటమి సర్కారు తనను అరెస్టు చేసి తీరుతుందని గట్టిగా నమ్ముతున్న జగన్… అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on May 22, 2025 6:30 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…