కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీపై ఎన్ ఫోర్స్‌మెంటు డైరె క్టరేట్(ఈడీ) సంచలన అభియోగాలు నమోదు చేసింది. వీటినే.. తాజాగా కోర్టుకు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియాగాంధీ ఒక్కరే రెండు విడతలుగా 142 కోట్ల రూపాయలను వెనుకేసుకున్నా రని ఈడీ ఆరోపించింది. దీనిలో 92 కోట్ల రూపాయలను రాహుల్‌గాంధీ పేరిట నొక్కేశారని(ఇలానే.. కిక్ ది మనీ) వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఎవరి పట్లా జాలి చూపించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం మరింత సంచలనంగా మారింది.
నేషనల్ హెరాల్డ్ కేసును విచారిస్తున్న ఈడీ.. ఇటీవల చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిలో తొలిసారి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల పేర్లను పేర్కొంది. ఇలా గాంధీల కుటుంబానికి చెందిన ఇద్దరు అగ్ర నేతల పేర్లు చార్జిషీట్‌లో కి ఎక్కడం ఇదే తొలిసారి. అది కూడా అవినీతి ఆరోపణలతో కావడం మరింత సంచలనం. ఈ చార్జిషీట్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు.
ఇవీ ఈడీ వాదనలు..
— రాహుల్, సోనియాగాంధీలు నేరపూరిత ఆస్తుల ద్వారా దాదాపు 142 కోట్లు పోగేసుకున్నారు.
— సోనియా, రాహుల్, శామ్‌పిట్రోడా(కాంగ్రెస్ నేత, విదేశాల్లో ఉన్నారు.) సుమన్ దూబే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.
— అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా, యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు సంపాదించింది.
— నేర పూరిత కుట్ర ద్వారా పోగేసుకున్న ఆదాయాన్ని రాజకీయాలకు వినియోగించారు.
— నేషనల్ హెరాల్డ్ స్థిరాస్థుల ద్వారా వచ్చిన రూ.142 కోట్ల ఆదాయాన్ని వాడుకున్నారు.
— ఈ సొమ్మును 14 శాతం వడ్డీతో సహా వసూలు చేయాల్సి ఉంది.
— ఈ సొమ్ము లావాదేవీలను మనీలాండరింగ్‌గా పరిగణించాలి.
This post was last modified on May 21, 2025 3:56 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…