పాకిస్థాన్‌కు దేశ రహస్యాలు అందజేస్తోందంటూ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌ను తాజాగా హరియాణా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత కొన్ని వారాలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని చిన్నపాటి యుద్ధం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. డానిష్ అనే పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన అధికారితో జ్యోతి సంబంధాలు కలిగి ఉందని.. ఆమె దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంతర్గత సమాచారాన్ని అందజేసిందని ఆరోపణలు వచ్చాయి.
ఐతే ఒక యూట్యూబర్ అంత పని ఎందుకు చేస్తుందని.. దేశ రహస్యాలను పంచుకునే స్థాయికి ఆమెకు ఉంటుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మన వాళ్లు పాకిస్థాన్ వాళ్లతో స్నేహం చేయడం.. ఆ దేశానికి వెళ్లడం కొత్తేమీ కాదని.. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇది నేరంగా అనిపిస్తుండొచ్చని వీళ్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ జ్యోతి గత ఏడాదిగా ఏం చేసిందో తెలిస్తే ఆమె అమాయకురాలు కాదని అర్థమవుతుంది. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న పాత ట్వీట్‌ను గమనిస్తే జ్యోతి వ్యవహారం అంత తేలికైందేమీ కాదని తెలుస్తుంది. తను ఐఎస్ఐ ఏజెంట్ అనే ఆరోపణల్లో నిజం లేకపోలేదనే అనిపిస్తుంది.
ఏడాది కిందట కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు. ఆమె పది రోజుల కిందటే పాకిస్థాన్ ఎంబసీ ఫంక్షన్లో పాల్గొందని, అలాగే పాకిస్థాన్‌కు కూడా వెళ్లి వచ్చిందని.. ఇప్పుడు కశ్మీర్‌కు వెళ్తోందని.. ఈమె మీద ఒక కన్నేసి ఉంచాలని ఏఐఏకు అతను సూచించాడు. యూట్యూబ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగిన జ్యోతి తాను ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇండియాలో పాకిస్థాన్ దౌత్య అధికారులతో వేడుకల్లో పాల్గొన్న వీడియో, అలాగే పాకిస్థాన్‌ను సందర్శించినప్పటి వీడియోలు, అలాగే కశ్మీర్ పర్యటన తాలూకు వీడియోలను పంచుకుంది. ఈ వీడియోలన్నింటినీ కనెక్ట్ చేసి చూస్తే ఆమె తీరు అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. పోలీసులు ఆషామాషీగా ఏమీ ఆమెను అరెస్ట్ చేయలేదని అర్థమవుతోంది.
This post was last modified on May 18, 2025 2:53 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…