వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో సతమతమైన నాని..ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. ఇందుకోసం ముంబైలో చాలారోజులే ఉన్న నాని…ఇటివలే తిరిగివచ్చారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గుండె వ్యాధులకు చికిత్స తర్వాత రెస్ట్ మోడ్ లో ఉన్న నాని… తనకు అత్యంత సన్నిహితులను తప్పించి ఏ ఒక్కరిని కూడా తన దగ్గరకు కూడా అనుమతించడం లేదట. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత గుడివాడకు దాదాపుగా దూరం అయిపోయిన నాని… గుడివాడలోని తన అనుచరులకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎక్కడ తనపై కేసులు నమోదు అవుతాయోనన్న భయం నానిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం గమనార్హం.
అయితే వైసీపీ అదికారంలో ఉండగా… తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగిన నాని… టీడీపీ పై ప్రత్యేకించి ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేశారు. ఈ క్రమంలో బూతులు కూడా ఆయన నోట నుంచి అలా జాలువారిపోయాయి. ఇక మంత్రి హోదాలో గుడివాడలో ఆయన లెక్కలేనన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూటమి సర్కారు ఆరోపిస్తోంది. వాటిపై ఇప్పుడు ఏకంగా విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
ఈ విచారణలు ముగిసి కేసులు నమోదు అయ్యేలోగానే అమెరికా వెళ్లిపోయేలా నాని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే నాని కదలికలపై గట్టి నిఘా పెట్టిన కూటమి సర్కారు… ఆయనను అంత ఈజీగా అమెరికా వెళ్లనిస్తుందా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే చికిత్సల పేరిట నాని అమెరికా వెళ్లే దిశగా కదులున్నారని వాదనల నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on May 18, 2025 10:47 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…