భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసంలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ ఫ్యామిలీ శనివారం సరదాగా గడిపింది. స్వయంగా మోదీ పలుమార్లు పిలవగా…లోేకేశ్ తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి శనివారం ఢిల్లీ వెళ్లారు. మోదీ తన అదికారిక నివాసం వేదికగా లోకేశ్ ఫ్యామిలీకి అదిరిపోయే విందు ఇచ్చారు. ప్రదాని నివాసంలో లోకేశ్ ఫ్యామిలీ దాదాపుగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు గడిపింది.
ఈ సందర్భంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు లోకేశ్ యువగళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 3 వేల కిలోమీటర్లకుపైగా సాగిన ఈ యాత్రలో లోకేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. ప్రజల కష్టసుఖాలను పంచుకున్నారు. వైసీపీ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడతానని శపథం చేశారు. అనుకున్నట్లు గానే బీజేపీ, జనసేనలతో కూడిన కూటమితో లోకేశ్ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ లెక్కన లోకేశ్ రాజకీయ గమనంలో యువగళానికి ఓ కీలక అధ్యాయం ఉందని చెప్పాలి.
అలాంటి యువగళానికి సంబంధించి ఓ కాపీ టేబుల్ బుక్ రూపొందగా…దానిని మోదీతో ఆవిష్కరింపజేయించిన లోకేశ్… తొలి కాపీని మోదీకే అందజేశారు. ఈ కాపీని అందుకున్న మోదీ… అందులోని వివరాలను ఆసక్తిగా తిలకించారు. వాటి గురించి ఆయా వివరాలను లోకేశ్ ను అడిగి మరీ తెలుసుకున్నారు. లోకేశ్ పాదయాత్ర కారణంగానే ఏపీలో కూటమి రికార్డు విక్టరీని సాధించిందని కూడా మోదీ పేర్కొన్నట్లు సమాచారం. యువగళం గురించి మోదీకి వివరిస్తూ లోకేశ్ తన్మయత్వానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తన ఆహ్వానం మేరకు ఫ్యామిలీతో తన ఇంటికి వచ్చిన లోకేశ్ కు మోదీ అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. లోకేశ్, బ్రాహ్మణిని ఆత్మీయంగా పలకరించిన మోదీ…దేవాన్ష్ ను అయితే తనపై కూర్చోబెట్టుకుని ముద్దు చేశారు. ఇలా మోదీ ఇంట లోకేశ్ గంటన్నరకు పైగా అలా ఉండిపోయారు. రాష్ట్రానికి కేంద్రం సహకారాన్ని లోకేశ్ కోరగా…ఆ విషయాన్ని తనకు వదిలేయాలని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. మోదీ ఇంట లోకేశ్ ఫ్యామిలీ ఆతిథ్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on May 18, 2025 7:09 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…