ఏపీలోని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర.. ఇక్కడి ఎమ్మార్వో(తహసీల్దార్)కు వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనను బూతులు తిట్టాడని పేర్కొంటూ.. తహసీల్దార్ జయలక్ష్మి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వాట్సాప్ కాల్ చేసి.. బండ బూతులు తిట్టాడని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. ఇలా ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అసలు తెరవెనుక ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం ఎమ్మార్వో చెప్పలేదు.
ఇక, శనివారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర.. విషయం చెప్పుకొచ్చారు. రైతుల నుంచి ఎమ్మార్వో లంచాలు తీసుకున్నారని.. ఇద్దరే రైతుల నుంచి 10 లక్షల చొప్పున డిమాండ్ చేశారని తెలిపారు. అయితే.. ఇంత పెద్ద మొత్తం లంచాలు తీసుకుని కూడా ఆమె పనులు చేయకుండా రైతులను వేధిస్తున్నారన్నారు. దీనికి సంబంధించి రైతులు తనకు ఫిర్యాదు చేశారని, అందుకే ఎమ్మార్వో కు పోన్ చేసి మందలించానన్నారు. ఈ క్రమంలో తిట్టిన మాట వాస్తవమేనని చెప్పారు.
అంతేకాదు.. అసలు ఎమ్మార్వోకు మతిస్థిమితం లేదని, ఆమెను తక్షణం విశాఖపట్నం ఆసుపత్రిలో చే ర్పించాలని .. ఉద్యోగం నుంచి తీసేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే.. ఎమ్మార్వో వర్సెస్ ఎమ్మెల్యే వివాదంపై పరిష్కారం చూపించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో జిల్లా మంత్రి గుమ్మిడి సుధారాణి ఈ విషయాన్ని పరిశీలించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా.. ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నారని జయలక్ష్మి ఆరోపించడం గమనార్హం.
ఇదిలావుంటే.. మండలస్థాయి అధికారి లంచాలు తీసుకుంటున్నట్టు ఆరోపిస్తున్న ఎమ్మెల్యే… అసలు ఇప్పటి వరకు ఏం చేశారన్నది ప్రశ్నగా మారింది. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఎక్కడా రూపాయి కూడా తీసుకోకుండా పనులు చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ, స్వయంగా ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నారని.. ఎమ్మార్వో, కాదు ఎమ్వార్వోనే లంచావతారం గా మారారని ఎమ్మెల్యే పరస్పరం ఆరోపించుకోవడం ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది.
This post was last modified on May 17, 2025 3:35 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…