Political News

వంశీని పాపాలు ప‌ట్టి పీడిస్తున్నాయి

చేసుకున్న పాపం చెబితే పోతుంద‌ని సామెత‌. కానీ.. రాజ‌కీయాల్లో చెప్పినా చెప్ప‌క‌పోయినా.. పోయేట్టు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే పాపాల తీవ్ర‌త అలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. గ‌తంలో చేసిన పాపాలు ఒక్కొక్క‌టిగాకాదు.. మూకుమ్మ‌డిగా ముందుకు వ‌స్తున్నాయి. దీంతో వ‌ద‌ల వంశీ అంటూ కేసులు.. జైళ్లు.. ఆయ‌న‌ను ప‌ట్టి పీడిస్తున్నాయి. తాజాగా రెండు కేసుల్లో ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చింది.

1) స‌త్య‌వ‌ర్థ‌న్ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో బెయిల్ పొందారు. దీంతో ఆయ‌న జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని.. కుటుంబం స‌హా.. ఆయ‌న అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే…2వ కేసు విష‌యానికి వ‌స్తే.. ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్య‌క్తికి సంబంధించిన ఇంటి వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. వాటితో స‌ద‌రు ఇంటిని వేరే వ్య‌క్తి (వంశీ అనుచ‌రుడ‌ని టాక్‌) స్వాధీనం చేసుకునేలా వంశీ స‌హ‌క‌రించారి కేసు న‌మోదైంది. దీంతో ఆయ‌న మ‌ళ్లీ జైలులోనే ఉన్నారు. అయితే.. చిత్రంగా దీనిలోనూ ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చింది.

అయితే.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వంశీ ప్ర‌సాదంపాడు (విజ‌య‌వాడ శివారులో)లోని ఓ బూత్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌న్న స‌మాచారంతో అక్క‌డికి వెళ్లి హ‌ల్చ‌ల్ సృష్టించారు. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదైంది. దీంతో ఇది విచార‌ణ‌లో ఉంది. ప్ర‌స్తుతం దీనిలో బెయిల్ ద‌క్కితే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందని కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కానీ, ఇంత‌లోనే మ‌రో కేసు తెర‌మీద‌కి వ‌చ్చింది.

అది కూడా కోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైసీపీ హ‌యాంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ న‌మోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేయ‌డంతోపాటు.. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. అంటే.. ఇది కొత్త కేసన్న‌మాట‌. దీంతో వంశీ ఎన్నిక‌ల కేసు నుంచి బెయిల్ పొందినా.. తాజాగా న‌మోదైన కేసులో జైల్లోనే ఉండ‌నున్నార‌న్న మాట‌. దీంతో చేసిన పాపాలు ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 16, 2025 10:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Vamsi

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago