Political News

నాడు ఇందిర.. నేడు మోదీ

భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో సైనిక పాటవం భారత్ కు లేకపోవచ్చు. కాని ఇప్పుడలా కాదు. ఏ ఒక్క దేశానికి కూడా తీసిపోని రీతిని భారత సైనిక సత్తాను కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా భారత సైన్యానికి అత్యధిక ప్రోత్సాహం లభించిన పాలనల్లో రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వాటిలో తొలిది అలనాటి దివంగత ప్రదాన మంత్రి ఇందిరా గాంధీ నడిపిన ప్రభుత్వం కాగా… ఇప్పుడు అదికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోది.

రాజకీయ కారణాలు చూపి… ఇతరత్రా కొన్ని అసంబద్ధ నిర్ణయాలను చూపించి ఇందిరా గాంధీ పాలనను తక్కువ చేసి మాట్లాడినా… ఇందిరా గాంధీ హయాంలో భారత సైన్యం తన సత్తాను చాటింది. అంతేనా భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది కూడా ఇందిర హయాంలోనే. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లోని సైనిక స్థావరాలకు వెళ్లిన ఇందిర… భారత సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేవారు. భారత రక్షణ రంగానికి కూడా ఆమె ఇతోదికంగా నిధులు కేటాయించారు. భారత సైనిక సత్తాను ఎప్పటికప్పుడు ఇనుమడించేలా కీలక చర్యలు చేపట్టారు.

ఇక తాజాగా నరేంద్ర మోదీ సర్కారు విషయానికి వస్తే… ఇందిర తర్వాత భారత సైన్యానికి ఆ స్థాయి… ఇంకా చెప్పాలంటే ఇందిర పాలన కంటే కూడాభారత సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం దక్కుతోన్న కాలమిది. ఏ చిన్న అవకాశం చిక్కినా ఎంచక్కా సరిహద్దులకు వెళుతున్న మోదీ… భారత సైనికులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ పర్యటనలతో సైనికుల్లో ఆయన నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. సైనిక పాటవాన్ని పెంచే దిశగా మోదీ సర్కారు వేలాది కోట్ల నిధులను కేటాయించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆయా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ తరహా పర్యటనల్లో బాగంగా మంగళవారం ఉదయం నరేంద్ర మోదీ పంజాబ్ లోని నియంత్రణ రేఖ వెంట ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఇటీవల కొనసాగిన ఆపరేషన్ సిందూర్ లో పాక్ భూభాగంపైకి దూసుకెళ్లిన భారత వాయుసేన విమానాలన్నీ కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచే గాల్లోకి ఎగిరాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో దూసుకు వెళ్లిన వాయుసేన విమానాలు పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను తుత్తునీయలు చేశాయి. అంతేకాకుండా భారత్ పైకి దూసుకువచ్చిన పాక్ డ్రోన్లు, షెల్ లను మన సైనికులు గాల్లోనే పేల్చేశారు. ఈ సైనికుల్లో నూతన ఉత్సాహం నింపే దిశగా ఆదంపూర్ వెళ్లిన మోదీ అక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.

This post was last modified on May 13, 2025 5:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి సినిమాలకు కొత్త సంకటం

ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…

24 minutes ago

తమన్ చెప్పింది రైటే… కానీ కాదు

అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…

2 hours ago

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…

2 hours ago

రెండో విడతలోనూ హస్తం పార్టీదే హవా!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…

4 hours ago

కేసీఆర్ హరీష్‌తో జాగ్రత్త!: మహేష్ కుమార్

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…

5 hours ago

మనసు మార్చుకుంటున్న దురంధర్ 2

రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…

5 hours ago