Political News

సైనికులకు అండగా జనసేనాని

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా… సంచలనంగానే నిలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న వేళ భారత సైన్యంలో పనిచేస్తున్న ఏపీ సైనికులకు బాసటగా నిలిచే దిశగా పవన్ శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సైనికులు, వారి కుటుంబాలకు స్థిరాస్తి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపును ఇస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం నిర్ణయాన్ని ప్రకటించడంతోనే సరిపెట్టని పవన్.. దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును కూడా శుక్రవారమే విడుదల చేయించారు.

దేశ సరిహద్దులో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులకు ఏంత మేర లబ్ధి చేకూర్చినా తక్కువేనని చెప్పాలి. ఆ మేరకు ఎప్పటికప్పుడు కేంద్రం భారత సైన్యంలో పనిచేస్తున్న సైనికులతో పాటుగా, పనిచేసి ఇప్పటికే రిటైర్ అయిన మాజీ సైనికులకు కూడా ఎన్నో రకాలుగా లబ్ధి చేకూరుతోంది. వారి కుటుంబాల జీవనోపాదికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధంలో వీర మరణం పొందే బారత సైనికుల కుటుంబాలకు ఏ లోటు కూడా రాకుండా చూసుకుంటున్న వైనం మనం చూస్తున్నదే. ఇన్ని రకాలుగా ప్రభుత్వ సాయం అందుతున్న సైనిక కుటుంబాలకు ఇంకేం చేయొచ్చు అన్నదిశగా ఆలోచించిన పవన్…ఆస్తి పన్నులు పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం: 49 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనిక కుటుంబాలు ఇకపై ఆస్తి పన్నును కట్టాల్సిన అవసరం లేదు. భారత సైనిక కుటుంబాలే కాకుండా…ఇప్పటికే రిటైర్ అయిన సైనికులు, సైనిక వితంతు కుటుంబాలకూ ఈ ఆస్తి పన్ను మినహాయింపును వర్తింపజేయనున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అంతేకాకుండా ఈ ఉత్తర్వులు జారీ అయిన మరుక్షణం నుంచే సైనిక కుటుంబాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందని కూడా ఉత్తర్వుల్లో విస్పష్టంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటిదాకా ఈ విషయంలో కొనసాగుతున్న లబ్ధి, ఇకపై అందులో పెరుగుతున్న లబ్ధి గురించిన సమాచారాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

This post was last modified on May 10, 2025 12:45 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

1 hour ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

4 hours ago