Political News

ఈడీ దెబ్బ‌.. వైసీపీలో కుదుపు.. !

వైసీపీ అధినేత జగ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) దెబ్బ కొత్త‌కాదు. ఆయ‌నకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌డం.. ఆయ‌న‌ను జైలుకు కూడా పంపించ‌డం తెలిసిందే. కానీ, ఇత‌ర నాయ‌కుల‌కు మాత్రం ఈడీ దెబ్బ కొత్త‌గానే ఉంది. ముఖ్య‌మంత్రుల‌ను సైతం అరెస్టు చేయ‌గ‌ల శ‌క్తి ఉన్న ఈడీ ఇప్పుడు వైసీపీపై దృష్టి పెట్టింది. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం లో.. 3 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా వివ‌రాలు త‌మ‌కు ఇవ్వాల‌ని ఈడీ తాజాగా లేఖ రాసింది. ఇక‌, కోరి కోరి కేంద్ర‌మే ముందుకు వ‌స్తే.. ఈ వివ‌రాలు ఇవ్వ‌కుండా.. రాష్ట్ర అధికారులు మాత్రం నీళ్లు న‌ములుతారా? ఈ విష‌యంపై సీఎంవో నుంచి కూడా అధికారుల‌కు ప‌క్కా స‌మాచారం వెళ్లింది. వెంట‌నే సంబంధిత ఆధారాలు.. సాక్ష్యాలు.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన విచార‌ణ తాలూకు వివ‌రాల‌ను ఈడీకి 24 గంట‌ల‌లోనే అందించాల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు తెలిసింది.

దీంతో మ‌ద్యం కుంభ‌కోణంలో జ‌రిగిన మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఆయా వివ‌రాల‌ను ఈడీకీ అందించ‌నుంది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీనికి కుదిపేస్తోంది. ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు.. ఈడీకి తేడా ఉండ‌డం.. అవ‌స‌ర‌మైతే.. నెల‌ల త‌ర‌బ‌డి కేసును కూపీలాగ‌డం వంటివి జ‌రుగుతాయి. అప్పుడు ఖ‌చ్చితంగా నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఈ వ్య‌వ‌హారంతో ఇప్పుడు మ‌ద్యం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీ మిధున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబాలు హ‌డ‌లిపోతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఈడీ కేసులు ఎదుర్కొన‌లేద‌ని.. ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చింద‌ని మిధున్‌రెడ్డి త‌న ప‌రివారం ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు కూడా.. ఇప్పుడు అప్రూవ‌ర్లుగా మారే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈడీ ఎంట్రీతో జీవితాల‌ను నాశ‌నం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమ‌ని.. దీనిలో ఒక్క‌రూపాయి కూడా తాము తిన‌న‌ప్పుడు.. నిజాలు చెప్పేయ‌డ‌మే బెట‌ర్ అని అంటున్నారు. ఫ‌లితంగా వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 9, 2025 3:10 pm

Share
Show comments

Recent Posts

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

15 minutes ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

2 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

3 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago