Political News

పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడికి భారత్ రివేంజ్ తీర్చుకుంది. 1971 తర్వాత తొలిసారిగా పాక్ భూభాగంలోకి చొరబడి మరీ క్షిపణి దాడులు నిర్వహించింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్ తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి దాదాపుగా 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

భారత ఆర్మీ, భారత ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. పాక్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను మిస్సైల్స్ ధ్వంసం చేశాయి. అయితే, ఇది పాకిస్తాన్ పై దాడి కాదని, కేవలం పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి మాత్రమేనని భారత ఆర్మీ ట్వీట్ చేసింది.

పూర్తి కచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాలపై మాత్రమే మిసైల్ దాడులు చేశామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ పౌరులు, పాకిస్తాన్ ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత్ ఆర్మీ స్పష్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 నిమిషాలకు ఈ దాడులు చేపట్టినట్లు భారత ఆర్మీ అధికారికంగా ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోడీ ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించారు. ఈ దాడిపై భారత ఆర్మీ ఈరోజు ఉదయం 10 గంటలకు అధికారికంగా పూర్తి సమాచారంతో వివరాలు వెల్లడించనుంది. మరోవైపు, ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన సిసిఎస్ సమావేశం జరగబోతుందని తెలుస్తోంది.

ఈ మెరుపు దాడుల నేపథ్యంలోనే భారత్, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జస్టిస్ సర్వ్ డ్ అంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. మరోవైపు, భారత దాడులను పాక్ ఆర్మీ ధృవీకరించింది. పాకిస్థాన్ లోని కోట్లి, ముడకీ, బహబల్పూర్, ముజఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలిపింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలయ్యాయి తెలిపింది. భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాకిస్తాన్ డీజీ ఐఎస్పిఆర్ఎస్ జనరల్ అహ్మద్ షరీఫ్ అన్నారు. ఈ దాడులపై పాక్ ప్రధాని షాబాద్ షరీఫ్ కూడా స్పందించారు. పాకిస్థాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగాయని, ఈ దాడికి పాక్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని అన్నారు.

This post was last modified on May 7, 2025 8:10 am

Share

Recent Posts

మెగా క్యాంపులో సుప్రీమ్ హీరోనే బ్యాలన్స్

కొరియన్ కనకరాజు హిట్టయిపోయింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేయడంతో వరుణ్ తేజ్ సంతోషం మాటల్లో చెప్పలేం. నాలుగు డిజాస్టర్ల…

3 hours ago

యష్ &  విశాల్… ఇన్ని పోలికలున్నాయా

సరిగ్గా పన్నెండు రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న టాక్సిక్, మకుటం కొన్ని విషయాల్లో చాలా సారూప్యతలు చూపిస్తున్నాయి. మొదటిది…

6 hours ago

ఈసారి అసెంబ్లీకి రాకపోతే కష్టమే జగన్

రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు…

9 hours ago

టాక్సిక్ విధ్వంసం 191 నిమిషాలు ?

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్…

11 hours ago

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి విద్యార్థుల సెగ‌.. కేంద్రం మౌనం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అంటే.. రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి అంత‌టి పోస్టు. ఈ ప‌ద‌వికి అనేక మంది వ‌న్నె తెచ్చారు.…

11 hours ago

‘వందేమాత‌రం’ పూర్తిగా పాడం: రాష్ట్రాల అల్టిమేటం

మ‌రో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ…

11 hours ago