Political News

చంద్ర‌బాబు ‘పీ-4’ కోసం ప‌ని చేస్తారా? అయితే రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌పిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుక‌దా! పేద‌ల‌ను ధ‌నికులుగా చేయాలన్నది ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం. ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్స్‌-పార్ట‌న‌ర్ షిప్‌గా పేర్కొనే ‘పీ-4’ ద్వారా వ‌చ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని 20 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ధ‌నికులుగా చేయాల‌ని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. గ‌త నెల‌లో విస్తృతంగా ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌చారం కూడా క‌ల్పించారు.

స‌మాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు.. పేద‌ల కుటుంబాల‌కు సాయం చేయ‌డం ద్వారా రా ష్ట్రంలో పేద‌రికాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌న్న‌ది చంద్ర‌బాబు సంక‌ల్పం. సాయం పొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా, సాయం చేసేవారిని ‘మార్గ‌ద‌ర్శ‌కులు’గా చంద్ర‌బాబు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అద్భుత‌మైన జాబ్ నోటిఫికేష‌న్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

పీ-4 కోసం ప‌నిచేయ‌డ‌మే ఈ ఉద్యోగుల ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ నెల 1వ తారీకు నాటికి 40 ఏళ్ల వ‌య‌సు మించ‌ని యువ‌తీయువ‌కులు.. ఈ ఉద్యోగాల్లో చేరొచ్చు. అయితే.. ఏడాదిపాటు మాత్ర‌మే కాంట్రాక్టు ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా.. ప్ర‌భుత్వానికి అవ‌స‌రం ఉంద‌ని భావిస్తే.. ప‌నితీరు ఆధారంగా కాంట్రాక్టును పొడిగిస్తారు. ఇక‌, నెల‌నెలా రూ.60000 వేత‌నంగా చెల్లిస్తారు. టీఏ, డీఏలు అద‌నంగా ఉంటాయి.

ఏం చేయాలి?

పీ-4 ఉద్యోగులు.. బంగారు కుటుంబాల‌ను గుర్తించ‌డం.. నిరంత‌రం వారిని మానిట‌రింగ్ చేయ‌డం వంటివి చేయాలి. అదేవిధంగా మార్గ‌ద‌ర్శ‌కుల‌ను కూడా గుర్తించాలి. వారిని ప్ర‌భుత్వంతో క‌లిసి ముందుకు సాగేలా ఒప్పించాలి. ఇదొక ర‌కంగా.. రిప్రెజెంటేష‌న్ త‌ర‌హా ఉద్యోగాలు. ఇవి మాన‌సిక ఆనందంతోపాటు.. పేద‌రిక నిర్మూల‌న‌లోనూ.. ఉద్యోగుల పాత్ర‌ను ప్ర‌ధానంగా మెరిసేలా చేస్తాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. 175 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ, పీజీ చేసి, 40 ఏళ్లు మించ‌ని వారు.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రెడీ అవ్వండి!.

This post was last modified on May 3, 2025 8:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

11 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

1 hour ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

3 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

3 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

3 hours ago