బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు వెళ్లిన ఆయన స్వయంగా తన ఇంటి పత్రాలను వారికి ఇచ్చి.. సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం.. 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయన గతంలోనూ మంత్రిగా పనిచేసి ఉండడం.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవసరం ఏముందన్న సందేహం వస్తుంది.
అయితే.. ఈ అప్పు.. తన కోసం కాదు. తన నియోజకవర్గంలోని పేద కుటుంబానికి చెందిన యువతి ఉన్నత చదువు కోసం.. హరీష్‌రావు అప్పు చేసి మరీ నిధులు సమకూర్చారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రం కుటుంబం పేదరికంలో ఉంది. అయితే.. ఆయన కుమార్తె మమత నీట్‌లో సీటు దక్కించుకుంది. దీంతో గతంలోనే హరీష్‌రావు ఆ కుటుంబాన్ని ఆదుకుని.. ఎంబీబీఎస్ కు అయ్యే సొమ్మును భరించారు. ఇప్పుడు మమత.. పీజీలోనూ సీటు దక్కించుకుంది.
కానీ, ఏటా 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఈ విషయాన్ని రామచంద్రం.. ఇటీవల హరీష్ రావు దృష్టికి తెచ్చారు. తమకు ఇల్లు, పొలం వంటివి ఏమీ లేవని.. ఉంటే విద్యారుణం తీసుకునే వారమని విలపించారు. ఈ కష్టం చూసి కరిగిపోయిన హరీష్‌రావు.. నేనున్నానంటూ.. పెద్ద మనసు చాటుకున్నారు.
శుక్రవారం ఉదయం బ్యాంకు కు వెళ్లి.. తన ఇంటి పత్రాలను తాకట్టుగా పెట్టి.. విద్యా రుణం తీసుకున్నారు. అనంతరం.. తన ఇంటికి చేరుకుని.. మమతను శాలువాతో సత్కరించి.. మూడేళ్లకు సరిపోయేలా 20 లక్షల రూపాయల సొమ్మును ఆమెకు అందించారు. దీంతో మమత ఆనందబాష్పాలు రాల్చింది. హరీష్ రావు చేసిన సాయాన్ని జన్మ జన్మలకూ మరిచిపోలేనని పేర్కొంది.
కాగా.. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. జగ్గారెడ్డి కూడా.. ఓ పేద కుటుంబానికి చదువు కోసం 10 లక్షల రూపాయలను సాయం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి, బట్టలు పెట్టి మరీ నగదు నోట్ల కట్టలను వారికి ఇచ్చి.. ప్రోత్సహించారు. ఇప్పుడు హరీష్‌రావు కూడా ఇదే పనిచేశారు. కాగా.. ఇరువురి సాయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 19, 2025 5:07 pm
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…