గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఫ్యామిలీ రూటులోకి వచ్చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోటీ విపరీతంగా ఉన్నా సరే పండగ బరిలో దిగుతున్న ఈ సినిమా ఆల్రెడీ థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ పూర్తి చేసుకుంది. బిగ్ స్క్రీన్ మీద కచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కాంపిటీషన్ పట్టించుకోకుండా వస్తున్నారు.
కథపరంగా చూసుకుంటే గతంలో చాలాసార్లు చూసిందే. భర్త (రవితేజ)ని శ్రీరామచంద్రుడు అనుకునే ఒక అమాయక భార్య(డింపుల్ హయతి)కి మొగుడే లోకం. కానీ సదరు మహాశయుడు కంపెనీ పని మీద విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడో అమ్మాయి (ఆశికా రంగనాథ్) ని ఇష్టపడి ప్రేమలో పడేలా చేస్తాడు. తిరిగి వచ్చాక అసలు సంకటం మొదలవుతుంది. కొంత కాలం ఏదోలా మేనేజ్ చేసినా ఫైనల్ గా దొరికిపోతాడు. మరి ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయట పడ్డాడు అనేది స్టోరీ. అల్లరి మొగుడు, ఆవిడా మా ఆవిడే, పెళ్ళాం ఊరెళితే లాంటి పాత హిట్స్ ఛాయలు చాలానే ఉన్నాయి కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైనా దాచారేమో చూడాలి.
ఇలా ఇద్దరితో ప్రేమలో పడే సబ్జెక్టుని రవితేజ లైక్ చేశాడంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. విజువల్స్ పరంగా చెప్పడానికేం లేదు. స్మూత్ గా స్టోరీకు తగ్గట్టు ఉన్నాయి. డింపుల్ హయతి కన్నా ఆశికా రంగనాథ్ గ్లామర్ షో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. జనవరి 13 విడుదల కాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకరవరప్రసాద్ గారు వచ్చిన రెండో రోజు థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఒకరకంగా చెప్పాలంటే రవితేజ సేఫ్ గేమ్ ఆడినట్టు చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడో వర్కౌట్ అయిన ఈ పాత ఫార్ములాతో దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త తరం ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారో ఇంకో నెలలోపే తేలనుంది.
This post was last modified on December 19, 2025 5:20 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…