మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో ఇది రివర్స్ లో ఉంది. జనవరి 9 విడుదల కానున్న విజయ్ జన నాయకుడుకి పోటీగా శివ కార్తికేయన్ పరాశక్తి వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు అనౌన్స్ చేసిన డేట్ జనవరి 14. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడీ పరాశక్తి తేదీని మార్చి జనవరి 10కే తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. ఆ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చి చెన్నైలోని పంపిణీదారులతో ఈ మార్పు గురించి నిర్మాతలు చర్చలు చేస్తున్నట్టు సమాచారం.
ఇక్కడ ఆలోచించాల్సిన కోణాలు చాలా ఉన్నాయి. మొదటిది రాజకీయంగా విజయ్ కు చెక్ పెట్టేందుకు చూస్తున్న అధికార పార్టీ వర్గాలు తమ పరిధిలోనే ఉన్న పరాశక్తి డిస్ట్రిబ్యూషన్ ని ప్రేరేపించడం ద్వారా డేట్ మార్పించారని ఒక వర్షన్ వినిపిస్తోంది. రాజకీయాలకు ముందు ఎంత విజయ్ చివరి సినిమా అయినప్పటికీ పరాశక్తిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం కాన్సెప్ట్ తీసుకుని దర్శకురాలు సుధా కొంగర చాలా ఇంటెన్స్ గా తీశారట. కంటెంట్ కనక జనాలకు కనెక్ట్ అయితే వెల్లువలా థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది.
ఇటువైపు జన నాయకుడుది రెగ్యులర్ స్టోరీనే. భగవంత్ కేసరి పాయింట్ తీసుకుని దానికే దర్శకుడు హెచ్ వినోత్ చాలా మార్పులు తీసుకుని కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించారట. దీనికి అయిదు రోజుల గ్యాప్ ఇవ్వడం వల్ల భారీ వసూళ్లు విజయ్ ఖాతాలో వెళ్లిపోయే రిస్క్ ఉంది కాబట్టి దాన్ని పంచుకునే ఉద్దేశంతో పరాశక్తిని రంగంలోకి దింపుతున్నారని విజయ్ అభిమానులు కస్సుమంటున్నారు. తెలుగులో చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టితో కాంపిటీషన్ ఉంది కాబట్టి డబ్బింగ్ వెర్షన్ ముందుగా వస్తే ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అవుతుందనేది పరాశక్తి ఆలోచన కావొచ్చు.
This post was last modified on December 19, 2025 5:35 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…