కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్ మీడియా ఫాలో అయ్యే కొందరు అమాయక అభిమానులు అర్థం లేని లీకులను నిజమని భావించి టెన్షన్ పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవలే ఒక గ్రూప్ యూట్యూబర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో కలుసుకున్నారు. వాళ్లలో ఒకడు నాకు పెద్ది స్టోరీ ముందే తెలుసని, అలాంటి కథలో చికిరి చికిరి లాంటి పాట ఎలా పెడతారని ఏదేదో పేలాడు. దానికి మిగిలినవాళ్లు తాళం కొడుతూ అవునా బ్రో అంటూ భుజాలు ఎగరేయడం, ఇదంతా ఓ రేంజ్ కామెడీ అయ్యింది.
ఇంతకీ ఈ లీక్ ఇచ్చిన మహానుభావుడు ఎవరయ్యా అంటే ఇటీవలే ఒక రివ్యూ విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిన వీరుడు. పేరులోనే చిత్ర విచిత్రమైన పదాలు పెట్టుకున్న ఈ సదరు యుట్యూబర్ కు ఆ నిర్మాత ఓ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం వైరల్ అయింది. విచారణ జరిగాక అందరూ దాన్ని మర్చిపోయారు కానీ ఇలా ప్యాన్ ఇండియా సినిమాల గురించి ఇష్టం వచ్చినట్టు పేలేవాళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రీమియర్లు వేసినప్పుడు, ఈవెంట్లు జరిగినప్పుడు, టికెట్లు ఉచితంగా పంపి మరీ కొందరు పిఆర్ లు ఈ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఇలాంటి గాలి బ్యాచులకు వందల కోట్లతో తీసే ప్యాన్ ఇండియా సినిమాల కథలు కాదు కదా కనీసం వాటికి పనిచేసే లైట్ బాయ్స్ తో కూడా పరిచయాలు ఉండవు. కేవలం ఏదో ఒక చోట వచ్చిన చిన్న లీకును పట్టుకుని దాని చుట్టూ స్టోరీ అల్లేసుకుని ఇలా గర్వంగా చెప్పుకు తిరుగుతారు. ఇది బ్లైండ్ గా నమ్మేసిన అభిమానులు అయ్యో మా హీరో హిట్టు కొడతాడో లేదోనని ఆందోళన పడుతారు. అయినా రివ్యూల పేరుతో దందాలు చేసుకునే వీళ్ళ మాటలు ఒక్క శాతం నమ్మాల్సిన అవసరంలేదు. పెద్దినే కాదు అంతకన్నా పెద్ద పెద్ద సినిమాల గురించి వీళ్లకు నయా పైసా తెలియదన్నది అసలు నిజం.
This post was last modified on December 19, 2025 10:29 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…