Political News

జ‌గ‌న్ ఆశ‌లు ఫ‌ట్‌… ‘బ‌ల‌’మైన సంకేతం.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాకిచ్చే ప‌రిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌ల కూట‌మిని ఆయ‌న ఎంత తేలిక‌గా తీసుకుంటున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ కూట‌మి బీట‌లు అవుతుంద‌ని.. నాయ‌కుల మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తున్నాయని.. త‌న అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రొజెక్ష‌న్ చేస్తున్నారు. వాస్త‌వానికి కూట‌మి ప్ర‌భుత్వాలు ఉన్న చోట స‌హ‌జంగానే వివాదాలు కూడా ఉంటాయి. వీటిని కాద‌న‌లేం. మ‌హారాష్ట్ర స‌హా.. బీహార్ వంటి చోట్ల పొర‌పొచ్చాలు క‌నిపిస్తున్నాయి.

ఏపీలోనూ ఇలానే జ‌రుగుతుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూట‌మి ముక్క‌లై… త‌నకు మేలు జ‌రుగుతుందని జ‌గ‌న్ అంచ‌నాలు వేసుకుంటున్నారు. కానీ.. వైసీపీ అధినేత వేసుకుంటున్న అంచ‌నాలు అంత క‌రెక్టు కాద‌న్న విష‌యం తాజాగా మ‌రోసారి కూడా రుజువైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోటి నుంచే కూట‌మి బ‌లం ఎంత ఉంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. “మ‌నమే(ప‌వ‌న్‌-చంద్ర‌బాబు-మోడీ) రాజ‌ధాని అమ‌రావతిని పూర్తి చేయాలి” అని నొక్కి మ‌రీ చెప్పారు.

స‌హ‌జంగా కూట‌మి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలా ఒక నాయ‌కుడు ‘మ‌నం’ అని వ్యాఖ్యానించ డం చాలావ‌ర‌కు త‌క్కువ‌గానే ఉంటుంది. పైగా మోడీ వంటి నాయ‌కుడు.. ఇలా వ్యాఖ్యానించారంటే.. ఈ మూడు పార్టీల మ‌ధ్య ఉన్న బ‌లం.. బంధం వంటివి స్ప‌ష్టం చేస్తున్నాయి. అందుకే.. మోడీ “ఎన్టీఆర్‌.. విక‌సిత భార‌త్ కోసం క‌ల‌లు క‌న్నార‌ని.. వాటిని మ‌నం సాకారం చేద్దామ‌ని” కూడా పేర్కొంటూ.. అన్న‌గారిని కూడా ప్ర‌స్తావించారు. ఇది టీడీపీ హార్డ్ కోర్ అభిమానుల‌ను మ‌రింత మంత్రి ముగ్ధుల‌ను చేసింది.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కూట‌మి నిర్వీర్య‌మైపోతుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న‌ను ప్ర‌జ‌లు అక్కున చేర్చుకుంటార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కానీ.. బ‌ల‌మైన సంకేతాలు ఇప్ప‌టికే వ‌స్తున్నాయి. ఇటు వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.వ‌చ్చే 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు తాము క‌లిసే ఉంటామ‌ని చెబుతున్నారు. తాజాగా మోడీ కూడా.. అంత‌పెద్ద ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా.. అంత పెద్ద వ్యూహాన్నే ఆవిష్క‌రించారు. సో.. ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్‌.. ఈ కూట‌మిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కుండా త‌న వ్యూహానికి ప‌దును పెంచితేనే పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ నాయ‌కులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on May 3, 2025 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago