న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. మార్చి నుంచి వాయిదా పడి ఆగస్ట్ కు వెళ్ళిపోయాక అభిమానులు దీని కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని రెండోసారి చేతులు కలపడంతో అంచనాలు మాములుగా లేవు. అందులోనూ అనిరుధ్ రవిచందర్ సంగీతం అంటే హైప్ ఎక్కడికి వెళ్తుందో వేరే చెప్పాలా. నాని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఈ పాటను కొంచెం ఆలస్యమైనా ఎట్టకేలకు ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. మూవీ లవర్స్ ఊహించుకున్నంత రేంజ్ లో ఉందా అంటే ఔననే చెప్పాలి.
ఆయా షేర్ అంటూ నాని క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన పద ప్రయోగాలు ఊర మాస్ గా ఉన్నాయి. మొలతాడు లేకపోయినా మగతనం నాదే, దుస్తులు లేకపోయినా దమ్మునోడిని నేనే అని అర్థం వచ్చేలా చాలా డెప్త్ గా అయితే వెళ్లారు.
అనిరుద్ రిథమ్, ఇన్స్ ట్రుమెన్ టేషన్ సంగీత ప్రియులు కోరుకున్న స్థాయిలోనే ఉంది. అసలు హైలైట్ నాని ఎప్పుడూ లేనంత జోష్ గా కొత్త రకం స్టెప్పులు వేయడం. నేల మీద మోకాళ్ళతో కూచుకుని సిగెరెట్ వెలిగించుకుని అటు నుంచి ఇటు వెళ్లే మూమెంట్, జడలతో వేసిన సిగ్నేచర్ స్టెప్ అభిమానులకు థియేటర్ మెటీరియలనే నమ్మకాన్ని ఇచ్చాయి.
మాములుగా అనిరుధ్ పాటలు స్లో పాయిజన్ లా ఎక్కుతాయి. దేవర టైటిల్ సాంగ్ మొదట మిశ్రమ స్పందన తెచ్చుకుని తర్వాత చార్ట్ బస్టర్ అయ్యింది. కానీ ప్యారడైజ్ ఆయా షేర్ మాత్రం అంత టైం తీసుకునేలా లేదు. రెండు జడలతో నాని చేయబోయే మాస్ ర్యాంపేజీ పాటల్లోనే ఇలా ఉంటే ఇక యాక్షన్ ఎపిసోడ్లు, ఫైట్లలో ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.
కీలక దశలో షూటింగ్ లో ఉన్న ప్యారడైజ్ లో కయదు లోహర్ హీరోయిన్ కాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటించగా సంపూర్ణేష్ బాబు ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. మొత్తానికి ఆయా షేర్ గట్టి సౌండ్ చేసేలా ఉంది. చూడాలి.
This post was last modified on February 24, 2026 10:12 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…