ఒక నాయకుడిని సస్పెండ్ చేస్తే.. చింత ఉండాలి. మార్పు రావాలి. కనీసం.. ఆవేదన అయినా ఉండాలి. కానీ.. వైసీపీ నుంచి సస్పెండ్ అవుతున్న నాయకులకు ఈ తరహా చింత లేకపోవడం.. గమనార్హం. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అయితే.. ఆయనలో చిన్నపాటి ఆవేదన కూడా లేకపోగా.. పై పెచ్చు.. ఇండిపెండెంటుగా ఉంటేనే బాగుందన్న కామెంట్లు చేయడం మరింతగా ఆయన శైలిని.. ఇగోను బట్టబయలు చేస్తోంది.
నిజానికి.. రాజకీయాల్లో ఉన్నవారు తమ పరిధులు తాము తెలుసుకుని ముందుకు సాగాలి. పార్టీకి ప్రయోజనకరంగా అయినా.. ఉండాలి. ఏదైనా తేడా వచ్చినప్పుడు తమను తాము సరిదిద్దుకునే ప్రయత్నం అయినా చేయాలి. ఇవేవీ లేకుండానే ఎదురు దాడి చేయడం.. తామంతటి వారు లేరన్న వాదనను వినిపించడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాజకీయాల్లో విధేయత అన్నది లేకపోతే.. చాలా కష్టమని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీలో కూడా.. చాలా మందిని సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. వారు తమను తాము తెలుసుకుని ముందుకు సాగారు. పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల వినయ విధేయతలు ప్రదర్శించారు. తద్వారా పార్టీలో పదవులు పొందిన వారు ఉన్నారు. ఇవన్నీ.. కూడా..నాయకులు చూపించే విధేయత, వినయం సంస్కారం వంటి వాటిపై ఆధారపడి ఉంటాయి. కానీ.. ఈ తరహా సంస్కృతి, సంప్రదాయాలు.. వైసీపీలో కనిపించడమే లేదు.
అధికారంలో ఉంటే దోచుకోవడం.. దాచుకోవడమే పరమావధిగా మారిన పరిస్థితి నుంచి మార్పు దిశగా నాయకులు అడుగులు వేయాల్సిన పరిస్థితి రావాల్సి ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. కానీ.. వైసీపీ నాయకుల్లో ఈ తరహా మార్పు కనిపించడం లేదు. పార్టీని నడిపించడం.. బలోపేతం చేయడం.. వంటి వాటిపై వ్యక్తిగతంగా దృష్టి పెట్టే నాయకులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి మారితే తప్ప. వైసీపీకి మంచి రోజులు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 25, 2025 2:21 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…