ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా.. బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తోంది. 2023 నాటి ఎన్నిక ల్లో పార్టీ అధికారం కోల్పోవడం.. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోరంగగా పరాజయం కావడం దరిమిలా.. ఇప్పుడు పార్టీలో చేతనత్వాన్ని నింపాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ నెల 27న కనీ వినీ ఎరుగని రీతిలో ఈ రజతోత్సవ వేడుకలకు పార్టీ రెడీ అయింది.
అయితే.. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. బీఆర్ఎస్ సభ పెట్టుకుంటే.. అధికార పార్టీ అలెర్ట్ కావడం ఏంటన్న చర్చ సాధారణంగానే ఉంటుంది. కానీ.. ఈ సభ ద్వారా.. రెండు కీలక విషయాలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలిసింది. 1) పార్టీని పునర్నిర్మించడం. 2) తమ పార్టీలోకి.. కాంగ్రెస్ అసంతృప్తులను ఆహ్వానించడం. ఈ రెండు విషయాలు కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయి. బీఆర్ఎస్ పునర్నిర్మాణం..అంటే.. ఇది ఆపార్టీ వ్యక్తిగత వ్యవహారంకావొచ్చు.
కానీ, చేరికల విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టడం.. మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బందిగానే మారనుందన్న చర్చ సాగుతోంది. గత 2023 ఎన్నికల తర్వాత.. బీఆర్ఎస్ నుంచి సుమారు 13 మంది వరకు నాయకులను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. వీరంతా.. బలమైన నాయకులు.. వీరిలో ఓడిన వారు గెలిచిన వారు కూడా ఉన్నారు. కొందరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కూడా. వీరంతా.. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరారు.
ఈ క్రమంలో తమ పార్టీని దెబ్బేసిన.. కాంగ్రెస్‌కు అంతే దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్‌లో చేరిన నాయకులతో .. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులకు పొసగడం లేదు. కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలతో హస్తం పార్టీ నేతలు విభేదిస్తున్నారు. ఈ క్రమంలో వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తి.. కాంగ్రెస్‌పై పగను పెంచుతోంది.
దీనిని పరిశీలించిన కేసీఆర్.. ఇలాంటి కీలక నాయకులను తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సదరు అసంతృప్తులను గుర్తించి.. బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అయినప్పటికీ.. కొందరు నాయకులు మాత్రం.. ససేమిరా అంటున్నారని.. వారు బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27న ఏం జరుగుతుందన్నది ఇరు పార్టీల సీనియర్లు..ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on April 24, 2025 2:25 pm
నేచురల్ స్టార్ నాని నుంచి ‘హిట్-3’ లాంటి వయొలెంట్ ఫిలిం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇందులో వయొలెన్స్ వేరే లెవెల్లో…
పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ దాడులకు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించుకుని.. కాల్పుల…
ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి సినిమాల్లోకి వెళ్తాం అని అంటే.. కంగారు పడేవాళ్లే కుటుంబ సభ్యులే ఎక్కువ. బ్యాగ్రౌండ్ లేకుండా…
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.…
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…