గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన వైసీపీని చాలా మంది వదిలేశారు. కీలక రెడ్డి నాయకుల నుంచి అనేక మంది బీసీల వరకు.. కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కీలకమైన కార్యకర్తల వంతు వచ్చింది. ఏ పార్టీకైనా.. నాయకులతోపాటు.. కార్యకర్తలు చాలా కీలకం. నాయకులు జంప్ చేస్తారు..కానీ.. కార్యకర్తలు మాత్రం ఎంతో కొంత అంకిత భావంతో పార్టీలను అంటిపెట్టుకుని ఉంటారు. ఎన్నికల సమయంలోనూ..వారే కీలకం.
ఈ విషయాన్ని గుర్తించే.. దాదాపు అన్ని పార్టీలూ..కార్యకర్తలే తమకు బలమని.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతాయి. కార్యకర్తల సెంట్రిక్‌గా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాయి. అయితే.. వైసీపీ విషయానికి వస్తే.. కార్యకర్తలనను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గత వైసీపీ హయాంలో వలంటీర్లే సర్వస్వంగా అప్పట్లో సీఎం జగన్ వ్యవహరించారు. ఇది పార్టీకి మేలు చేయకపోగా.. ఓడించేసింది. తద్వారా.. పార్టీ నామరూపాలు లేకుండా పోయిందన్న చర్చ ఉంది.
ఇంత పరాభవం తర్వాత.. ఒకటి రెండు సార్లు.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నానని జగన్ చెప్పుకొచ్చా రు. కానీ.. నెలలు గడిచిపోతున్నా.. ఆయన కార్యకర్తల విషయంలో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. పైగా.. టీడీపీ సహా కూటమి నాయకులు.. కార్యకర్తలపై పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే జరిగితే.. జైలుకు వెళ్తోంది.. కార్యకర్తలు, నాయకులే. కనీసం వారిని పరామర్శించడంలోనూ.. న్యాయపరంగా రక్షణ కల్పించడంలోనూ..వైసీపీ అధినేత విఫలమవుతున్నారు.
ఆయా విషయాలను గమనిస్తున్న వైసీపీ కార్యకర్తలు.. ఇప్పుడు ప్లేట్ మార్చేస్తున్నారు. టీడీపీ కానీ.. జనసేన కానీ..కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారు గుర్తించారు. సీఎం చంద్రబాబు సైతం..తన ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ.. కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కష్టాల్లో ఉంటున్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. భరోసా కల్పిస్తున్నారు. ఈ పరిణామాలతో వవైసీపీలో అలజడి రరేగింది. ఇంకా పార్టీని నమ్ముకుని ఇక్కడే ఉంటే కష్టమనిభావిస్తున్న వారు.. జెండా మార్చేసేందుకు రెడీ అయ్యారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మంది కార్యకర్తలు.. గత రెండు రోజుల్లోనే టీడీపీ, జనసేనల బాటపట్టడం గమనార్హం.
This post was last modified on April 24, 2025 9:51 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…