వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత ఇష్టమైన ఆధ్యాత్మిక గురువు.. విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠం స్వామి.. స్వరూపానందేంద్ర. ఆయన చెప్పినట్టే అనేక పనులు చేశారు. ఎవరికీ తల వంచడని వైసీపీ నాయకులు చెప్పే జగన్.. స్వరూపానంద వద్ద మాత్రం తల వంచారు. పీఠానికి వెళ్లి.. పూజల్లోనూ పాల్గొన్నారు. 2019 ఎన్నికలకు ముందు.. జగన్ సీఎం కావాలని స్వరూపానంద.. యాగాలు కూడా చేశారు. దీంతో ఆయన రుణాన్ని స్థలాలు.. భూముల రూపంలో వైసీపీ తీర్చుకుందన్న ఆరోపణలు వున్నాయి.
ఇదిలావుంటే.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు.. విశాఖ శారదా పీఠానికి తిరుమలలో కొంత స్థలం కేటాయించారు. ఇక్కడ వేద విద్య పాఠశాలను నిర్మిస్తామని.. శారదా దేవి పీఠం ఏర్పాటు చేస్తామని.. అప్పట్లో స్వరూపానంద ప్రకటించారు. వీటి మాట ఎలాఉన్నా.. కేటాయించిన స్థలం కాకుండా.. మరో 20 వేల చదరపు అడుగులను ఆక్రమించి.. నిర్మాణాలు చేశారు. దీనిపై కూటమి సర్కారు వచ్చాక.. ఫిర్యాదులు అందాయి. సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు.. విచారణకు ఆదేశించారు.
ఈ క్రమంలో శారదా పీఠం.. హైకోర్టు కు వెళ్లింది.. కొన్నాళ్లు స్టే తెచ్చుకుంది. కానీ.. టీటీడీ కూడా.. హైకోర్టు లో బలమైన వాదనలు వినిపించడంతోపాటు.. ఆధారాలను కూడా చూపించింది. ఫలితంగాసదరు స్థలంలో చేపట్టిన వాటిని వదిలేసి వెళ్లిపోవాలని.. దీనిపై పూర్తి హక్కులు తిరుమల తిరపతి దేవస్థానానికే ఉన్నాయని.. హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో తాజాగా టీటీడీ బోర్డు.. స్వరూపానంద నేతృత్వంలోని పీఠానికి నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో ఖాళీ చేసి తమకు అప్పగించాలని పేర్కొంది.
అయితే.. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని బోర్డు సభ్యులు భావించారు. కానీ,.. చంద్రబాబు మాత్రం.. నిర్మాణం పూర్తయిన భవనాన్ని కూల్చివేయడం సరికాదని.. ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని.. గత తిరుమల పర్యటన సందర్భంగా అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో ఈ భవనాన్ని సుందరీకరించి.. వీఐపీ బసకు వినియోగించనున్నట్టు ఈవో తెలిపారు. ఇదిలావుంటే.. అదే జగన్ ఉండి ఉంటే.. కూల్చివేత కే ఆదేశించే వారని.. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
This post was last modified on April 21, 2025 7:17 pm
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…