ఒక్క దెబ్బకు రెండు షాకులు అంటే.. ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సౌండ్ లేకుండా చేశారు. కీలకమైన రెండు విషయాల్లో చంద్రబాబు చేసిన రాజకీ యం వైసీపీ నేతలకు నోట మాట రాకుండా… లేకుండా కూడా చేసింది. 1) మత్య్సకారులకు ఇచ్చే భృతి. 2) పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం. ఈ రెండు విషయాలను వైసీపీ తనఖాతాలో వేసుకుంది. ఈ రెండు కూడా.. చంద్రబాబు అమలు చేయలేదని ప్రచారం చేస్తోంది.
వాస్తవానికి 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పథకాలను కూడా.. కూటమి సర్కారు పట్టించుకోలే దనే చెప్పాలి. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో భృతిఇవ్వాల్సి ఉంది. కానీ, అప్పటికి ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కూటమి సర్కారు నేతలు మౌనంగా ఉన్నారు. దీంతో అప్పట్లోనే వైసీపీ యాగీ చేసింది. మత్స్యకారులకు వైసీపీ మేలు చేసిందని.. కూటమిపట్టించుకోవడం లేదని పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా సంధించింది.
ఇక, పాస్టర్ల విషయాన్ని కూడా.. వైసీపీ రాజకీయం చేసింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వారికి కూడా .. కూటమి సర్కారు రూపాయి ఇవ్వలేదు. వైసీపీ హయాంలో నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనంగా అందించారు. అయితే.. కూటమి ఏర్పడ్డాక.. పింఛన్ల పెంపుదలకు ప్రాదాన్యం ఇచ్చారే తప్ప.. ఇతర విషయాల జోలికి పోలేదు. దీంతో ఇది కూడా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అయింది. దీంతో పాస్టర్ల విషయాన్ని కూడా ప్రస్తావించాలని భావించారు.
కానీ, వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు అవకాశం ఇవ్వకుండా.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది నుంచి బకాయి ఉన్న పాస్టర్ల గౌరవ వేతనాన్ని గురువారంరాత్రి రూ.30 కోట్ల వరకు విడుదల చేశారు. అంతేకాదు.. మత్స్యకార భరోసా కింద.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.20000 చొప్పున ఈ నెల 26న సీఎం చంద్రబాబు అందించేందుకు రెడీ అయ్యారు. ఈ రెండు విషయాల్లోనూ కూటమి సర్కారు జాగ్రత్తగా అడుగులు వేసింది. దీంతో వైసీపీనాయకులకు విమర్శించే ఛాన్స్ లేకుండా చేసుకున్నారు.
This post was last modified on April 19, 2025 10:55 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…